IPL క్రికెట్ లో హద్దులు చెరిపి.. క్రికెటర్ల మధ్య అద్భుతమైన వాతావరణం కల్పించిన టోర్నీ. అయితే ఈ మెగా టోర్నీ ద్వారా శత్రువులు అయిన ఆటగాళ్లూ ఉన్నారు.. మిత్రులైన ఆటగాళ్లూ ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరు భారతదేశ క్రికెట్ అభిమానులకు ఎంతో దగ్గరైయ్యారు. వార్నర్, కేన్ మావ లాంటి ప్లేయర్స్ అభిమానుల గుండెల్లో స్థానాలు సంపాదించుకున్నారు. అయితే ఓ స్టార్ క్రికెటర్ మాత్రం టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విరాట్ తో కలిసి ఆడితేనే అతడి నిజ స్వరూపం అనేది తెలుస్తుందని, నేను అతడితో ఐపీఎల్ కలిసి ఆడినప్పుడే నాకు ఆ విషయం తెలిసిందని అన్నాడు.
విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్.. భారత తురుపు ముక్క.. వరల్డ్ క్లాస్ ప్లేయర్.. రికార్డుల రారాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే పదాలు చాలవు. ఇవన్నీ కోహ్లీకి ఒకవైపు అని, మీ అందరికి తెయని విరాట్ ను నేను ఐపీఎల్ లో.. అతడితో కలిసి ఆడుతున్నప్పుడు చూశానని సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. గ్రేడ్ క్రికెటర్ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన డుప్లెసిస్.. విరాట్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. డుప్లెసిస్ మాట్లాడుతూ..”మీరు విరాట్ తో కలిసి ఆడుతున్నప్పుడే మీకు అతడి కేరింగ్ గురించి తెలుస్తుంది. మిమ్మల్ని అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటాడు. మీకు ఉన్నతమైన గౌరవాన్ని ఇస్తాడు. మీకు అతడి నిజ స్వరూపం అతడితో కలిసి ఉంటేనే తెలిసేది. విరాట్ మిస్టర్ ఫర్ ఫెక్ట్” అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు డుప్లెసిస్.
అలాగే విరాట్ లాంటి వ్యక్తిని నేనింత వరకు చూడలేదని, అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ పై విరాట్ కు ఉన్న ప్రేమే అతడిని ఈ స్థాయిలో నిలిపిందని వ్యాఖ్యానించాడు. విరాట్ ఓ సూపర్ మాన్ అని కితాబిచ్చాడు ఫాఫ్. ఇక వీరిద్దరు కలిసి ఐపీఎల్ టీమ్ అయిన బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా తమ టీమ్ కు తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించాలని పట్టుదలతో ఉన్నారు డుప్లెసిస్ అండ్ విరాట్. ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ ను చూస్తే.. బెంగుళూర్ కు ఐపీఎల్ ట్రోఫీ సాధించడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది.
Faf du Plessis opens up on his healthy relationship with Virat Kohli at RCB.#CricTracker #FafduPlessis #ViratKohli pic.twitter.com/ILwQY5uhi1
— CricTracker (@Cricketracker) November 23, 2022
Veteran South Africa captain #FafduPlessis praised batting #ViratKohli.https://t.co/H9jYjhhgXu
— CricTracker (@Cricketracker) November 24, 2022