టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 2న ఆగ్రాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయి హనీమూన్ పనుల్లో ఉన్న బిజీగా జంటకు.. వివాదాల గోల ఇప్పట్లో తప్పేలా లేదు. మొన్నటికి మొన్న.. దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ “హానీమూన్ లో నీ నడువుము జాగ్రత్త తమ్ముడూ..” అంటూ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. ఈ క్రమంలో.. దీపక్ చాహర్ రిసెప్షన్‌లో పాక్ క్రికెటర్ సందడి చేశాడంటూ మరో వార్త చక్కర్లు కొడుతోంది.
ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న దీపక్ చాహర్.. సహచర ఆటగాళ్ల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లి రిసెప్షన్‌కు భారత యువ ఆటగాళ్లు చాలా మంది హాజరయ్యారు. వారిలో రిషభ్ పంత్, కరణ్ శర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్.. తదితరులు హాజరై చాహర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌కు సంప్రదాయ పఠానీ కుర్తాలో వచ్చిన వ్యక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కుర్తా ధరించిన ప్లేయర్.. పాకిస్థాన్ ఆటగాడు హసన్ అలీలా ఉండటంతో.. అతన్ని కూడా రిసెప్షన్‌కు పిలిచారా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెట్టారు.
Many Indian players attended the reception of Deepak Chahar’s wedding. pic.twitter.com/gUl1oAZq06
— Johns. (@CricCrazyJohns) June 4, 2022
ఇది కూడా చదవండి: Krishna Pandey: ‘ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు’.. యువరాజ్ రికార్డు సమం చేసిన పాండిచ్చేరి క్రికెటర్!
అయితే.. ఆ ఫొటోను నిశితంగా పరిశీలిస్తే అతను భారత్ పేసర్ ఖలీల్ అహ్మద్ అని స్పష్టమైంది. అతని వేషధారణ వల్లే ఈ కన్‌ఫ్యూజన్ వచ్చిందని నెటిజన్లు వివరించారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఖలీల్ అహ్మద్.. పర్వాలేనిపించాడు. ఇక.. హసన్ అలీ విషయానికొస్తే.. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు బాది సంచలన విజయాన్నందించిన హసన్ అలీ.. సెమి ఫైనల్ లో మాథ్యూవేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. దాంతో టైటిల్ గెలుస్తుందనుకున్న పాక్ జట్టు ఇంటిదారిపట్టింది. ఈ ఒక్క ఘటనతో హీరో కాస్తా జీరో అయ్యాడు.
Suresh Raina attended Deepak Chahar’s wedding reception along with CSK family 💛 pic.twitter.com/LggYt7d1Qj
— Suresh Raina FC™ (@CultRaina) June 4, 2022