ఇప్పటి వరకు మనం ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు చూశాం గానీ ఇప్పుడు చెప్పుకోయే క్యాచ్ మాత్రం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. ఈ అద్భుతమై క్యాచ్ యూరోపియన్ క్రికెట్ లీగ్ టీ10లో చోటుచేసుకుంది. అందరు సిక్స్ అనుకున్న ఆ బంతిని కాస్త ఇద్దరు ఫీల్డర్లు ఒడిసిపట్టుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే.
‘టేక్ ది క్యాచ్.. విన్ ది మ్యాచ్’ క్రికెట్ లో ఈ సూత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్యాచ్ మిస్ అయితే పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయో మనం చాలా క్రికెట్ మ్యాచ్ ల్లో చూశాం.ఈ సుత్రాన్ని అక్షరాల పాటిస్తూ.. చాలా మంది ఎన్నో అద్భుతమైన క్యాచ్ లను ఒడిసిపట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు మనం ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు చూశాం గానీ ఇప్పుడు చెప్పుకోయే క్యాచ్ మాత్రం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుంది.ఈ అద్భుతమై క్యాచ్ యూరోపియన్ క్రికెట్ లీగ్ టీ10లో చోటుచేసుకుంది. అందరు సిక్స్ అనుకున్న ఆ బంతిని కాస్త ఇద్దరు ఫీల్డర్లు ఒడిసిపట్టుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే.
ప్రస్తుతం యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్ జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా తాజాగా సీవైఎంస్ వర్సెస్ డ్రిక్స్ హార్న్స్ జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరిగింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థిపై 3 వికెట్ల తేడాతో డ్రీక్స్ హార్న్స్ విజయం సాధించింది. దాంతో యూరోపియన్ టీ20 లీగ్ ఫైనల్లోకి డ్రీక్స్ హార్న్స్ అడుగుపెట్టింది. 126 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డ్రీక్స్ జట్టు 9.2 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ సూపర్ క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే దాదాపుగా ఇలాంటి క్యాచ్ చూసుండరు. ఈ మ్యాచ్ లో డ్రీక్స్ హార్న్స్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్ లో ఈ అద్భుతం చోటుచేసుకుంది.సీవైఎంస్ ఆటగాళ్లు అయిన జాసన్ వాన్ డెర్ మోర్వ్, జాకబ్ ముల్డర్ ఇద్దరు అద్భుతమైన క్యాచ్ తో మెరిశారు.
ఈ క్రమంలోనే ఆడమ్ కెన్నడీ బౌలింగ్ లో డ్రీక్స్ హార్న్స్ బ్యాటర్ నబీ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బంతి గాల్లోనే ఎక్కువ సేపు ఉంది. దాంతో అందరు సిక్స్ అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వాన్ డెర్ మోర్వ్ చిరుతలా జంప్ చేసి.. సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బౌండరీ లైన్ దగ్గరగా ఉండటంతో..వెంటనే బంతిని గాల్లోకి విసిరిరాడు. పరిగెత్తుకొచ్చిన జాకబ్ ముల్డర్ ఆ బాల్ ను అందుకున్నాడు.ఇక స్పీడ్ కు అతడు కూడా బౌండరీ లైన్ దాటబోయాడు. కానీ తనను తాను నిగ్రహించుకుని అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇక్కడ మాత్రం టేక్ ది క్యాచ్ విన్ ది మ్యాచ్ సూత్రం పనిచేయలేదు.
Is this one of the best team catches ever?
Just when you thought you’d seen it all, Jason van der Merve and Jacob Mulder produce magic on the boundary! 😱🙌🏏@CIYMSCC #EuropeanCricket #ECL23 #StrongerTogether pic.twitter.com/G1Pj8imaE8
— European Cricket (@EuropeanCricket) March 24, 2023