సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు ఘర్షణలకు దారి తీస్తే.. మరికొన్ని ఘటనలు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది ప్రోటీస్ జట్టు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అంపైర్ మరైస్ ఎరాస్మస్ చేసిన పనికి మైదానం మెుత్తం నవ్వులు పూశాయి. ప్రస్తుతం అంపైర్ చేసిన ఈ సరదా పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంగ్లాండ్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. హోరా హోరిగా సాగిన ఈ మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు జెసన్ రాయ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేయడానికి వచ్చాడు ఎన్రిచ్ నోర్ట్జై. అప్పుడు లెగ్ అంపైర్ గా దక్షిణాఫ్రికా కు చెందిన మరైస్ ఎరాస్మస్ ఉన్నాడు. అయితే బౌలర్ బాల్ వేస్తుంటే చూడటమే అంపైర్ పని. ఈ క్రమంలోనే అసలు పనినే మర్చిపోయిన ఎరాస్మస్.. బౌలర్ బాల్ వేస్తుంటే పక్కకు తిరిగి తన చేతుల వైపు కిందికి చూసుకుంటున్నాడు. ఆ బాల్ ను రాయ్ అద్బుతమైన బ్యాక్ ఫుట్ షాట్ బాదాడు. ఇదే టైమ్ లో అంపైర్ పక్కకు తిరిగి ఉండటం కూడా కెమెరాలో రికార్డు అయ్యింది.
— 🗂️ (@TopEdgeCricket2) January 27, 2023
దాంతో అంపైర్ ఎరాస్మస్ పై నెట్టింట్లో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ” నాకు ఇంట్రెస్ట్ లేదు నేను మ్యాచ్ చూడను” అని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. జట్టులో వాన్ డెర్ డస్సెన్ (111) సెంచరీతో చెలరేగాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు కుప్పకూలింది. జట్టులో జేసన్ రాయ్ ఒక్కడే 113 పరుగులతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మరి ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్ లో అంపైర్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Marais Erasmus be like “Mujhe dekhna hi nahin hai. Mujhe Interest hi nahin hai ODIs mein”. #CricketTwitter #SAvsENG
pic.twitter.com/fm1bDyd3L7— Himanshu Pareek (@Sports_Himanshu) January 27, 2023