ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. అందులో భాగంగా గురువారం ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ కరాచీ విమానాశ్రయానికి చేరుకున్నారు. 2005 తర్వాత పాక్‌లో ఆంగ్లేయులు పర్యటించడం ఇదే తొలిసారి. గతేడాదే రావాల్సి ఉన్నా భద్రతా కారణాలతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తప్పుకోవడంతో ఈసీబీ అదే దారిలో నడిచింది. ఇది తమను అగౌరపరచడమే అంటూ అప్పట్లో పీసీబీ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి పాక్ వేదికగా ద్వైపాక్షిక సిరీస్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ సిరీస్ లో దేశ ప్రధాని.. విదేశీ పర్యటన చేస్తే.. ఏ తరహాలో భద్రత కల్పిస్తారో.. అదే తరహాలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు రక్షణ కల్పించనున్నారు.
పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఏ జట్లు సుముఖంగా లేవు. ఇది మనందరికి తెలిసిన విషయమే. భద్రతా లోపాలే అందుకు కారణం. ఇలానే.. ఎవ్వరు ఆడకున్నా.. మేము ఆడతామంటూ 2009లో శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలో లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ జరగకపోయినా.. ఐసీసీ అనుబంధ దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం ఈ దెబ్బతో పాక్ పర్యటన అంటేనే వెనుకడుగు వేశాయి. ఈ ఘటనతో పాక్ అంతర్జాతీయ క్రికెట్ జీవం కోల్పోయింది. దాంతో పాకిస్థాన్.. యూఏఈని తటస్థ వేదికగా ఎంపిక చేసుకొని సిరీసులు ఆడుతోంది.
On this day in 2009 #Pakistan terrorist attack on #SriLanka Cricket team. all cricket team never forget that day .#PakTerrorHeaven#BleedingPakistan#SureshRaina𓃵#OperationGanga pic.twitter.com/MwRLWXIae6
— Kavita Keshri (@KavitaKeshrii) March 3, 2022
ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనతో పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రాణం పోసుకోనుంది. అదీ ఏ ఘటన జరగకుండా.. అంతా అనుకున్నట్లు జరిగితే. ఇటీవలే ఆస్ట్రేలియా జట్టు కూడా పాక్‌లో పర్యటించింది. ఆ సిరీస్ ను సాకుగా చూపి.. ఇంగ్లాండ్ సిరీసునూ సురక్షితంగా పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తంచేయడంతో.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అందుకు ఒప్పుకుంది. అయితే.. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అడుగడుగునా భద్రత కల్పించనుంది. మ్యాచ్ జరిగే రోజుల్లో ఇంగ్లాండ్ బస చేసిన హోటల్ నుంచి కరాచీ స్టేడియం వరకు రహదారులను మూసివేయనున్నారు. స్టేడియం వైపుగా కనిపించే దుకాణాలు, కార్యాలయాలు బంద్ చేస్తారు. ఇంగ్లాండ్ టీమ్ బస్సు ప్రయాణాన్ని హెలికాప్టర్‌తో పర్యవేక్షించనున్నారు.
Our Men’s team have landed in Karachi ahead of our historic IT20 series against Pakistan. pic.twitter.com/TQEnKzaRpl
— England Cricket (@englandcricket) September 15, 2022
ఈ టూర్ లో ఇంగ్లాండ్ జట్టు 7టీ20లు, 3 టెస్టులు ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు టీ20 సిరీస్ జరగనుండగా, డిసెంబర్ 1 నుంచి 17 వరకు టెస్టు సిరీస్ జరగనుంది. కరాచీ వేదికగా మొదటి నాలుగు టీ20లు, లాహోర్ వేదికగా 5,6,7 టీ20లు జరగనున్నాయి. ఇంగ్లాండ్ జట్టు పాక్ పర్యటనపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రుపంలోతెలియజేయండి.
England Tour of Pakistan 🇵🇰 After 17 Years❤️
Pakistan VS England 7 T20I Schedule ❤️🔥 #PAKvENG #PakistanCricket #England pic.twitter.com/iABTxOtFD0— Sports #PAKvENG #NationalT20 (@OnlySports33) September 13, 2022