ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకుని ఒక్కటైయ్యారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్ సభ్యులు నాట్ స్కివర్, కేథరీన్ బ్రంట్ మే 29న వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రసారకర్త ఇసా గుహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. దాదాపు అయిదేళ్లుగా రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తున్న నాట్ స్కివర్, కేథరీన్ బ్రంట్ ఆదివారం పెళ్లి చేసుకున్నారు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన అమీ సటర్త్‌వైట్, లీ తహుహు అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన మారిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్ తర్వాత పెళ్లి చేసుకున్న లెస్బియన్ జంటగా స్కివర్, బ్రంట్ నిలిచారు.
వీరిద్దరి నిశ్చితార్థం 2019 అక్టోబర్‌లో జరిగింది. నాట్ స్కివర్, కేథరీన్ బ్రంట్ ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. వీరిద్దరి వివాహం అధికారికంగా 2020 సెప్టెంబరులోనే జరగాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు నిశ్చితార్థం అనంతరం నాలుగేళ్ల తర్వాత సంతోషంగా వివాహం చేసుకున్నారు. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో 2017లో ఇంగ్లాండ్ చారిత్రాత్మక మహిళల ప్రపంచకప్ విజయం గెలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టు విజయంలో బ్రంట్, స్కివర్ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ కప్ 2022లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించి మంచి కంట్రీబ్యూషన్ చేశారు. అయినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ టైటిల్ గెలుచుకోలేకపోయింది.ఇకపోతే దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌పై ఇంగ్లాండ్ జట్టు ఫోకస్ పెట్టింది. 2009లో ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్న ఇంగ్లాండ్.. రెండోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోవాలని ఆశిస్తుంది. ఇకపోతే న్యూజిలాండ్‌లో ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) మధ్య జరిగే వివాహాలు చట్టబద్ధమే. ఈ క్రమంలో అమీ సటర్త్ వైట్, లియా తహుహు 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటైన తొలి లెస్బియన్ క్రికెట్ జంటగా నిలిచారు. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. ఇక క్రికెట్లో లెస్బియన్ జంటలు ఒక్కటి కావడం కొత్తదేమీ కాదు. మరి ఈ పెళ్లి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: ఫైనల్‌లో చేతులెత్తేసిన రాజస్థాన్! ఏడ్చేసిన జోస్ బట్లర్
England women cricketers #KatherineBrunt and #NatSciver got married over the weekend with the cricket board’s Twitter handle sharing a picture of the two.https://t.co/LC0PkXSLch
— CricketNDTV (@CricketNDTV) May 30, 2022