బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న టెస్టులో టీమిండియా తొలి రోజు పైచేయి సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఆరంభంలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. వారి ధాటికి టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఈ దశలో రిషభ్ పంత్-జడేజా టీమిండియాను ఆదుకున్నారు. ముఖ్యంగా పంత్ తన ఎటాకింగ్ ప్లేతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులతో 146 పరుగులు చేసి దుమ్ములేపాడు.
ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి స్లిప్‌లో ఏకంగా ఐదుగురు ఫీల్డర్లను మొహరించిన ఇంగ్లండ్ కెప్టెన్.. పంత్ దెబ్బకు తీసి బౌండరీ లైన్ల పెట్టడం విశేషం. అంతలా ఇంగ్లండ్ ఫీల్డింగ్ డిస్టబ్ చేశాడు పంత్. అప్పటి వరకు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిప్పులు చెరుగుతున్న సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్, స్లాగ్ షాట్లు ఆడాడు పంత్. దీంతో బౌలింగ్ ఎలా చేయాలో? బంతులు ఎక్కడ వేయాలో? అర్థం కాక ఇంగ్లండ్ బౌలర్లు తలలుపట్టుకున్నారు. వన్డే తరహాలో తొలి అర్థ సెంచరీని 51 బంతుల్లో పూర్తి చేసిన పంత్.. సెంచరీ చేరుకునేందుకు టీ20 స్టైల్లో కేవలం 37 బంతులు మాత్రమే తీసుకున్నాడు.
సెంచరీ తర్వాత పంత్ మరింత చెలరేగిపోవడంతో.. మ్యాచ్ ఆరంభంలో ఎటాకింగ్ ఫీల్డ్ సెట్ చేసిన ఇంగ్లండ్ పంత్ దెబ్బకు ఆత్మరక్షణలో పడిపోయింది. స్లిప్‌లో ఫీల్డర్లను తగ్గించి బౌండరీ లైన్ల వద్ద పెట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. జేమ్స్ అండర్సన్ ధాటికి ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(17), చతేశ్వర్ పుజారా(13)లు క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి హనుమ విహారి, విరాట్ కోహ్లీ రాగా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేసి నిర్ణీత సమయం కన్నా ముందుగానే లంచ్ బ్రేక్‌ను ప్రకటించారు. దాంతో భారత్ 20.1 ఓవర్లలో 53/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
వర్షం ఆగిపోయిన అనంతరం ఆట మొదలైంది. వర్షం కారణంగా వృథా అయిన 40 నిమిషాలను అంపైర్లు పొడిగించారు. ఇక సెకండ్ సెషన్ ప్రారంభంలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. మ్యాటీ పోట్స్ తన వరుస ఓవర్లలోనే భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన హనుమ విహారి(20)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించిన మ్యాటీ.. ఆ మరుసటి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ బౌండరీలతో దూకుడు కనబర్చాడు.
కానీ అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా 15 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో 98 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. తొలుత కాస్త నిదానంగా ఆడిన ఈ ద్వయం అనంతరం జోరు పెంచింది. పంత్ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. పంత్ సూపర్ బ్యాటింగ్‌తో భారత్ 44 ఓవర్లలో 174/5 స్కోర్‌తో సెకండ్ సెషన్ ముగించింది.
ఆ తర్వాత మరింత ధాటిగా ఆడగా.. జడేజా అతనికి అండగా నిలుస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. పంత్ 89 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. బ్రాడ్ వేసిన 58వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసిన పంత్.. టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో నాలుగో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. క్రీజ్‌లో జడేజా 83, మొహమ్మద్ షమీ(0) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3, మ్యాటీ పోట్స్ 2, బెన్‌స్టోక్స్, జో రూట్ తలో వికెట్ తీసుకున్నారు. మరి పంత్ ఎటాకింగ్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
📸📸
💯 @RishabhPant17 #ENGvIND pic.twitter.com/FCEjm2yseq
— BCCI (@BCCI) July 1, 2022