టీ20ల రాకతో టెస్టు క్రికెట్ మీద ఆసక్తి తగ్గిపోతుండగా.. మళ్ళీ ఈ ఫార్మాట్ ని కాపాడటానికి ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది ఇంగ్లాండ్. దానినే "బజ్ బాల్" క్రికెట్ అంటారు. ఇందులో భాగంగా టెస్టు క్రికెట్ ని కూడా వన్డేల మాదిరి ఆడుతూ క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెక్కలం కోచ్ గా టెస్టు క్రికెట్ లో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్.. ఐర్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో మరింత వేగంగా ఆడడం విశేషం.
సంప్రదాయక టెస్టు క్రికెట్ ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇంగ్లాండ్. క్రికెట్ ప్రారంభ రోజుల్లో టెస్టు క్రికెట్ ఆడుతూ వస్తున్న ఇంగ్లాండ్ ఈ ఫార్మాట్ అంటే చాలా మక్కువ చూపిస్తుంది. అన్ని దేశాలు టెస్టు క్రికెట్ ఆడినా.. వీటి దృష్టి మొత్తం పరిమిత వర్ల క్రికెట్ మీదే ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఇప్పటికీ యాషెస్ తమ మొదటి ప్రాధాన్యంగా భావిస్తారు. అయితే ఇటీవల కాలంలో టీ20ల రాకతో టెస్టు క్రికెట్ మీద ఆసక్తి తగ్గిపోతుంది. అయితే టెస్టు క్రికెట్ కు ఉన్న క్రేజ్, దాని ఘనతను తగ్గించకుండా..మళ్ళీ ఈ ఫార్మాట్ ని కాపాడటానికి ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. దానినే “బజ్ బాల్” క్రికెట్ అంటారు. ఇందులో భాగంగా టెస్టు క్రికెట్ ని కూడా వన్డేల మాదిరి ఆడుతూ క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ ఐర్లాండ్ తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడుతుంది. లండన్ లో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచులో.. పసి కూన ఐర్లాండ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కేవలం 82.4 ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లాండ్ ఏకంగా 524 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్ లో ఒక టీం 500 పైగా పరుగులు చేసినప్పుడు రన్ రేట్ 6 కి పైగా ఉండడం క్రికెట్ చరిత్రలో ఒక అద్భుత ఘటన. గత కొంతకాలంగా మెక్కలం కోచ్ గా టెస్టు క్రికెట్ లో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్.. ఈ మ్యాచులో మరింత వేగంగా ఆడడం విశేషం. ఇంగ్లాండ్ జట్టులో అందరూ 90 కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఇంగ్లాండ్ బ్యాటర్లలో పోప్( 205) డబల్ సెంచరీతో చెలరేగగా.. బెన్ బకెట్( 182) భారీ శతకంతో మెరిశాడు. ఇక ఓపెనర్ క్రాలీ, రూట్ కూడా అర్ధ సెంచరీలతో రాణించారు. మొత్తానికీ బజ్ బాల్ రుచి పసికూన ఐర్లాండ్ కి ఎలా ఉంటుందో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరిచయం చేశారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.