సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సఫారీలు కేవలం 83 పరుగులకే ఆలౌటై మ్యాచ్ లో ఘోర పరాభవం చవిచూశారు.
29 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. కానీ, సౌత్ ఆఫ్రికా మరీ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఆడిల్ రషిద్ కు 3 వికెట్లు, టోప్లే, మోయిన్ అలీలు చెరో రెండు వికెట్లు తీశారు. విల్లీ, సామ్ కరణ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం జోస్ బట్లర్ పేరు మారుమ్రోగుతోంది. అందుకు అతను చేసిన సూపర్ కీపింగే కారణం.
6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా.. ఆ తర్వాత వరుసగా మరో రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ వేసేందుకు వచ్చిన విల్లీ తొలి బంతికే లివింగ్ స్టోన్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అదే ఓవర్లో 5వ బంతికి మార్కరమ్ డైమెండ్ డక్ గా వెనుదిరిగాడు. సింగిల్ కోసం కాల్ చేసి అతనే రనౌట్ గా పెవిలియన్ చేరాడు.
Seriously good work from @josbuttler 👏#ENGvSA pic.twitter.com/stgUtt4VSG
— England’s Barmy Army (@TheBarmyArmy) July 22, 2022
విల్లీ వేసిన బంతిని క్లాసెన్ డిఫెండ్ చేయగా.. మార్కరమ్ సింగిల్ కోసం కాల్ చేశాడు. వారు సింగిల్ తీసే క్రమంలో బంతిని అందుకున్న జోస్ బట్లర్ మెరుపు వేగంతో స్టంప్స్ ను గిరాటేశాడు. ఇప్పటివరకు క్రికెట్ ప్రపంచంలో ఇలాంటి స్టప్పింగ్స్ అనగానే ధోనీనే గుర్తొచ్చేవాడు. ఇప్పుడు అంతా ‘జోస్ బట్లర్ కాసేపు ధోనీలా కనిపించాడు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. జోస్ బట్లర్ కీపింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
@rajasthanroyals is @josbuttler (JOS THE BOSS) Superman🥵🥵🤔🤔 pic.twitter.com/MZRmR4blu1
— Amit Patel (@AmitPat31805054) July 22, 2022