టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి, టీమిండియా కెప్టెన్, సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు వినిపిస్తుంటాయి. ఒకరంటే ఒకరికి పడదని, అందుకే పెద్దగా క్లోజ్‌గా ఉండనే వాదన ఉంది. ఈ ఇద్దరి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ గొడపపడుతుంటారు. కానీ.. రోహిత్-కోహ్లీ ఎమోషనల్ బాండింగ్ వేరు. కెప్టెన్లుగా ఒకరినొకరు బ్యాక్ చేసుకున్న సందర్భాలు అనేకం. అయినా కూడా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ.. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌తో అవన్నీ వట్టి పుకార్లే అని మరోసారి రుజువైంది. మూడు టీ20ల సిరీస్ గెలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మరోసారి కోహ్లీ తన క్లాస్‌ను చూపించి టీమిండియాకు విజయాన్ని అందించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్ త్వరగానే అవుటైనా.. ముందు భారీ లక్ష్యం ఉన్నా.. యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌కు అద్భుతంగా నిర్మించాడు. ముందు సూర్యకు క్రీజ్‌లో కుదురుకునేందుకు సమయం ఇచ్చాడు. ఈ లోపు రన్‌రేట్ పడిపోకుండా మంచి ఎటాకింగ్ క్రికెట్ ఆడాడు. ఒక్కసారి సూర్య రిథమ్‌లోకి వచ్చిన తర్వాత తాను సైలెంట్ అయిపోయి అతనికి స్ట్రైక్ ఇస్తూ.. ఒక పక్కా ప్లాన్ ప్రకారం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో వికెట్‌ను కాపాడుకుంటూ సూర్యకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. కోహ్లీ అండతో రెచ్చిపోయిన సూర్య 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఇక్కడి నుంచి మళ్లీ ఇన్నింగ్స్‌ను హ్యాండోవర్ చేసుకున్న కోహ్లీ.. బ్యాటింగ్‌లో వేగం పెంచాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లినా.. విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో డెనియల్ సామ్స్ వేసిన తొలి బంతినే భారీ సిక్స్ కొట్టి టీమిండియా చేతుల్లో విజయం పెట్టేశాడు. రెండో బంతికే మ్యాచ్ ముగించాలనే కసి అద్భుతమై ఓవర్‌ది కవర్స్ షాట్ ఆడే ప్రయత్నంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అద్భుత క్యాచ్‌కు కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. కానీ.. అప్పటికే టీమిండియా విజయం ఖాయమైంది. 4 బంతుల్లో 5 పరుగులకే కావాలి. ఆ లాంఛనాన్ని హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ పూర్తి చేశారు.
బౌన్స్ లభిస్తున్న పిచ్‌పై టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి.. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదర్కొని భారీ టార్గెట్‌ను ఛేదించిందంటే అందుకు ప్రధాన కారణం కోహ్లీ. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు అవసరమైన సమయంలో వేగంగా ఆడి, అవసరం లేనప్పుడు స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. ఇన్నింగ్స్‌ను నిర్మించి తీరు అమోఘం. ఈ విజయంలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఎంత ప్రత్యేకమైందో అందరికంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బాగా తెలుసు. అందుకే.. విజయానికి అడుగు దూరంలో కోహ్లీ అవుటై డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎదురొచ్చి మరీ కోహ్లీని అభినందించాడు.
విజయం కోసం కోహ్లీ పడ్డ కష్టమేంటో రోహిత్‌కు తెలుసు. అలాగే మిగిలిన 5 పరుగులను ఇద్దరూ పక్కపక్కన మెట్లపై కూర్చోని చూస్తూ.. పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు సీన్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ‘కోహ్లీ-రోహిత్ మధ్య గొడవలున్నాయి అని ఎవరు చెప్పారు’ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. అయినా కోహ్లీ- రోహిత్ ఇద్దరి ఆట తీరు, స్వభావాలు వేరైనా.. ఆట పట్ల ఇద్దరికి ఒక విధమైన అకింతభావం కనిపిస్తుంది. వారిద్దరి ఉమ్మడి లక్ష్యం టీమిండియా గెలవాలి. అందు కోసం కోహ్లీ రన్స్ చేసినా రోహిత్ హ్యాపీ, రోహిత్ రన్స్ చేసినా కోహ్లీ హ్యాపీ. నిజానికి వీరిద్దరి మధ్య ఉండే ఆ ఎమోషనల్ బాండింగ్ చాలా మందికి అర్థం కాదు. మరి వీరిద్దరి బాండింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Scorecard ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS pic.twitter.com/FLvsIGc9sg
— BCCI (@BCCI) September 25, 2022
— CricTracker (@Cricketracker) September 25, 2022
ఇది కూడా చదవండి: రోహిత్ పిచ్చికొట్టుడు.. తొలి ఓవర్ తర్వాత మళ్లీ బాల్ ముట్టుకోని నెం.1 బౌలర్!