టీ20 క్రికెట్‌లో బ్యాటర్లదే హవా. ఎంత తోపు బౌలరైనా సరే.. మినిమమ్ పరుగులు సమర్పించుకోవాల్సిందే. పొట్టి ఫార్మాట్‌లో బ్యాటర్ల ఆధిపత్యం ఆర రేంజ్‌లో ఉంటుంది మరి. కానీ.. భారత మహిళా క్రికెటర్ ఏక్తా బిష్త్ మాత్రం తన బౌలింగ్‌తో బ్యాటర్లను ఓ ఆట ఆడుకుంది. తన కోటా 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 వికెట్లు పడగొట్టింది. మరో విశేషం ఏమిటంటే.. ఈ బౌలింగ్ స్పెల్‌లో ఒక హ్యాట్రిక్ కూడా నమోదు చేసింది. సంచలనమైన ఈ నాలుగు ఓవర్లను ఏక్తా సీనియర్ ఉమెన్స్ టోర్నీలో వేసింది. టీమిండియా సీనియర్ మహిళా క్రికెటర్లతో బీసీసీఐ దేశవాళీ టోర్నీ ఒకటి నిర్వహిస్తుంది. ఈ టోర్నీలో భాగంగా ఏక్తా.. ఈ అద్భుతమైన స్పెల్‌ను వేసింది.
మహారాష్ట్రలోని కండివాలిలోగల సచిన్ టెండూల్కర్ జిమ్‌ఖానా మైదానంలో ఉత్తరాఖండ్-జార్ఖండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 107 పరుగుల స్వల్ప స్కోర్ చేసింది. ఉత్తరాఖండ్ బ్యాటర్లలో నీలమ్ 41 పరుగులతో రాణించింది. జార్ఖండ్ బౌలర్లలో శుభ్, దివ్యాణి, నిధి బీ తలో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన జార్ఖండ్‌ను ఉత్తరాఖండ్ బౌలర్ ఏక్తా బిష్త్ తన బౌలింగ్‌తో బెంబేలెత్తించింది. 4 ఓవర్లు చేసిన ఏక్తా.. వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లే పెవిలియన్ చేర్చింది. తన స్పెల్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చిన ఏక్తా.. ఏకంగా 19 డాట్ బాల్స్ వేసి.. 7 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించింది. పైగా ఒక హ్యాట్రిక్ కూడా నమోదు చేసింది. ఏక్తా బాల్‌తో చెలరేగడంతో జార్ఖండ్ జట్టు 19.3 ఓవర్లలో 97 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఉత్తరాఖండ్ 10 పరుగులతో విజయం సాధించింది.
Ekta Bisht is the first Indian player (men/women) to take 7 wickets (including hat- trick) in a T20 innings
#SWT20Trophy #womencricket #JHAvUTT pic.twitter.com/BUUli2bPRA— Riya Rathore (@RathoreRiya7) October 20, 2022
4 Overs
7 Wickets (including a hat-trick)
8 Runs
19 DotsWhat a spell by Ekta Bisht in Uttarakhand’s game against Jharkhand! 🙌🏼😍#CricketTwitter pic.twitter.com/kCRfGvYqsP
— Women’s CricZone (@WomensCricZone) October 20, 2022
Missing from India’s T20I squad for over 3 years, spinner Ekta Bisht takes 7 wickets in T20 encounter#sportstakhttps://t.co/JMROwHwjXw pic.twitter.com/qyLRgwufVz
— Sports Tak (@sports_tak) October 20, 2022