టీమిండియా త్వరలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. వారితో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఇప్పటికే బీసీసీఐ భారత్ టెస్టు జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 22 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. అలాగే వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి ఆ బాధ్యతలతో పాటు టెస్ట్ వైస్ కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకు అప్పగించిన విషయం తెలిసిందే. కాగా గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టులకు దూరమయ్యాడు. అలాగే విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. చిన్న చిన్న కారణాలతో కీలక ఆటగాళ్లు కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నారనే విమర్శ వినిపిస్తుంది. దీని ముఖ్య కారణం ఈగో అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్సీ కారణంగానే ఇలా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడకుండా తప్పించుకుంటున్నారని అంటున్నారు.
సౌతాఫ్రికాతో సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. అలాగే జట్టుతో సీనియర్ ప్లేయర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టుతో ఉండడం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితిల్లో కేవలం ఈగోలతో జట్టుకు దూరంగా ఉండడం ఎంత వరకు సమంజసం అని క్రికెట్ అభిమానులకు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు సన్నిహితంగానే ఉన్నారు. రోహిత్ శర్మ కోసమే విరాట్ కోహ్లీ తన టీ20 సారథ్య బాధ్యతలను వదులుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఇక మెగా టోర్నీ దారుణ వైఫల్యం అనంతరం విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోగా.. రోహిత్ సారథిగా న్యూజిలాండ్ టీ20 సిరీస్ ఆడాడు. ఆ వెంటనే రెండు టెస్ట్‌ల సిరీస్ నుంచి రోహిత్‌కు రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. ఈ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడని కోహ్లీ సెకండ్ మ్యాచ్‌కు ఆడి సిరీస్ విజయాన్ని అందించాడు.
ఇదీ చదవండి: వపెళ్లి రోజు సందర్భంగా అనుష్కకు సూపర్ స్పెషల్ విషెస్ చెప్పిన కోహ్లీ! ట్వీట్స్ వైరల్
సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందే బీసీసీఐ.. కోహ్లీకి షాకిచ్చింది. బీసీసీఐ నిర్ణయం పట్ల ఆగ్రహంతో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని అవమానంగా భావించిన విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. తన కూతురు వామికా ఫస్ట్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నానని బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మపై ఉన్న కోపంతో అతని కెప్టెన్సీలో ఆడేందుకు విరాట్ కోహ్లీకి ఇష్టం లేదని అర్థమవుతుంది.
మరోవైపు రోహిత్ శర్మ సైతం మూడు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ పేర్కొంది. కానీ రోహిత్ కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకనే టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరే వరకు ఒకరికొకరు తలపడకుండా బీసీసీఐ ప్లాన్ చేసిందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ టీమిండియాకు నష్టం చేస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించడానికి కారణం ఇదే!