వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న బ్రావో.. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. 2008 నుంచి 2010 వరకు బ్రావో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. 2011 వేలంలో బ్రావోను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఆ తర్వాత సీఎస్‌కేపై రెండేళ్ల నిషేధం సమయంలో గుజరాత్ లైయన్స్‌కు ఆడిన బ్రావో.. మళ్లీ తిరిగి చెన్నై గూటికి చేరుకున్నాడు. అయితే.. ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఇటివల ముగిసిన రిటేషన్ విధానంలో బ్రావోను రిలీజ్ చేస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. కాగా.. ఈ నెలలో జరిగే మినీ వేలంలో బ్రావో పాల్గొంటాడని అంతా భావించినా…. అలా జరగలేదు.
ఐపీఎల్ 2023 కోసం నిర్వహించనున్న మినీ వేలంలో పాల్గొనేందుకు బ్రావో తన పేరును రిజిష్టర్ చేసుకోలేదు. దీంతో బ్రావో ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు బ్రావో. అయితే.. బ్రావో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అతని సేవలు జట్టుకు అవసరమని భావించింది. అందుకే బ్రావోను తమ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఐపీఎల్ 2023లో బ్రావో ఆటగాడిగా కాకుండా బౌలింగ్ కోచ్‌గా సీఎస్‌కే టీమ్‌లో కొనసాగనున్నాడు. తన కెరీర్‌లో మొత్తం 161 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. 113 ఇన్నింగ్స్‌ల్లో 1560 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 183 వికెట్లు పడగొట్టాడు బ్రావో. రెండు సార్లు 4 వికెట్ల హల్ సాధించాడు.
బ్రావో మాట్లాడుతూ.. ‘అత్యంత కష్టతరమైన టీ20 లీగ్‌లో 15 ఏళ్లపాటు ఆడిన తర్వాత, నేను ఇకపై ఐపీఎల్‌లో పాల్గొనడం లేదని ఈ రోజు ప్రకటిస్తున్నాను. ఇది చాలా ఎత్తుపల్లాలతో కూడిన గొప్ప ప్రయాణం. 15 ఏళ్లుగా ఐపీఎల్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నాకు, నా కుటుంబానికి మరియు ముఖ్యంగా నా అభిమానులకు ఇది విచారకరమైన రోజు అని నాకు తెలుసు. నేను మరింత ముందు సాగుతూ.. నా బౌలింగ్ బూట్లను వేలాడదీసి.. కోచింగ్ క్యాప్ ధరించడానికి ఎదురుచూస్తున్నాను. సీఎస్‌కేలో యువ బౌలర్లతో కలిసి పనిచేయడానికి నేనెంతో ఉత్సాహంగా ఉన్నాను. ఈ అవకాశం నాకు దక్కడంపై ఎంతో సంతోషంగా ఉన్నాను. తరువాతి తరం ఛాంపియన్‌లకు కోచ్‌గా పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. కొన్నేళ్లుగా నాపై ప్రేమ చూపిస్తూ.. నాకు మద్ధతుగా నిలిచిన వారంద్దరికి ధన్యవాదాలు.
నేను ఈ కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత.. నేను చేయబోతున్న తొలి పని ఇదే. సీఎస్‌కే బౌలర్లతో కలిసి పని చేయడానికి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆటగాడి నుంచి కోచ్‌గా మారడంలో నన్ను నేను ఎక్కువగా మార్చుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఆడుతున్న సమయంలో కూడా మిగతా బౌలర్లతో ప్లానింగ్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా అదే పని చేసేందుకు ప్రయత్నిస్తాను. అలాగే బ్యాటర్ల కంటే ఒక అడుగు ముందు ఉండాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తాను. ఆటగాడి నుంచి కోచ్‌గా మారుతున్న నాకు అనిపిస్తున్న తేడా ఒకే ఒకటి అదేంటంటే.. ఇకపై నేను మిడ్ ఆన్ లేదా మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ కోసం నిలబడను’ అంటూ ఈ సంరద్భంగా బ్రావో ఎమోషనల్ అయ్యాడు. బ్రావో మంచి బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు అద్భుతంగా ఫీల్డింగ్ కూడా చేస్తాడనే విషయం తెలిసిందే.
Is this a good move from Chennai? 🤔#Chennai #DJBravo #DwayneBravo #IndianT20League2023 #T20Cricket #Cricket #CricketBook pic.twitter.com/jMvbR9bfL6
— Cricket Book (@cricketbook_) December 2, 2022
DJ Bravo pic.twitter.com/4St7Yz9B7h
— RK (@Mahigoat007) December 2, 2022