భారత స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్ తన వివాహానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్దికాలంగా రిలేషన్షిప్ లో ఉన్న తన భాగస్వామితోనే.. తన పెళ్లి జరుగుతుందని కుండబద్దలు కొట్టింది. “తాను స్వలింగ సంపర్కురాలినని, తమ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ద్యుతీ చంద్” ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒడిశాలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన ద్యుతీ చంద్.. దేశానికి పరుగు పందెంలో పథకాలు అందించడమే కాకుండా.. ఒలింపిక్ అథ్లెట్ గా తనపైన చెరగని ముద్ర వేసుకుంది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2014 లో ద్యుతీకి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా.. 2014 కామన్వెల్త్ క్రీడల్లో ఆడించలేదు. దీంతో సర్జరీ చేయించుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి వచ్చింది. అయితే ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. తాను ఎవరికోసం మారనని తెగేసి చెప్పింది. అప్పట్లో.. ఈ విషయంపై ఆమె న్యాయపోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ లోనూ ఆమె పాల్గొనలేదు.
ఇది కూడా చదవండి: Dutee Chand: సీనియర్ల పైశాచికత్వాన్ని బయటపెట్టిన ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్!
అయితే.. ఈనెల 28 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్ లో 200 మీటర్ల రేసులో బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురుంచి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2024 ప్రపంచ అథ్లెటిక్స్ తరువాత తాను రిలేషన్ షిప్ లో ఉన్న అమ్మాయినే.. తాను పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. నిజానికి ద్యుతి ప్రేమించిన అమ్మాయి ఆమెకు కూతురు వరుస అవుతుంది. అందుకే.. ద్యుతి నిర్ణయాన్ని ఆమె తల్లి అకుజి చంద్ వ్యతిరేకిస్తున్నారు. ‘తమకు మనవరాలి వరుసయ్యే అమ్మాయితో పెళ్లి ఎలా జరిపించగలమని అకుజి చంద్ లబోదిబోమంటున్నారు’. ద్యుతి నిర్ణయంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఈ విషయంపై ద్యుతీ మాట్లాడుతూ.. “అవమానాలు నాకేం కొత్త కాదు. నా చిన్నప్పుడు స్కూల్ లో అందరూ లడ్కా (బాలుడు) అని ఎగతాళి చేసేవారు. 2014 తర్వాత సవాళ్లు కామన్ అయిపోయాయి. ఆటలోనే కాదు. గ్రౌండ్ బయట కూడా ఇదే పాసే చేశాను. ఇక.. 2019 లో నేను నా పార్ట్నర్ (మోనాలిసా)తో నా రిలేషన్షిప్ ను ప్రకటించినప్పుడు చాలా వివక్షతను ఎదుర్కున్నా. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లు పెట్టేవారు. మన సంస్కృతి ఏంటి..? నువ్వు చేస్తున్నదేంటి..? అని నన్ను ఎంతో మంది ప్రశ్నించారు. అప్పట్లో మా వ్యక్తిగత జీవితాలు సమాజానికి ఒక ఎంటర్టైన్మెంట్ లా మారాయి. కానీ, నేను అవేం పట్టించుకోలేదు. కొన్ని రోజులు బాధపడ్డా.. నా కెరీర్ పైనే ఫోకస్ పెట్టాను. నా పార్ట్నర్ కు ఇప్పుడు 22 సంవత్సరాలు. నాకు 26. ప్రస్తుతానికి మేమిద్దరం మా కెరీర్ లతో బిజీగా ఉన్నాం. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం” అని చెప్పుకొచ్చింది. ద్యుతీ చంద్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఊరంతా అవమానించినా.. ఆమె మాత్రం రాష్ట్రానికే పేరు తెచ్చింది!