భారత స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్ హాస్టల్‌లో ఉన్నప్పుడు తాను ఎదుర్కున్న కష్టాలు, సీనియర్లు చేసిన ర్యాగింగ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఒడిషాలోని ఓ ప్రభుత్వ క్రీడా హాస్టల్‌లో ఇటీవల రుచిక అనే క్రీడాకారిణి సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ద్యుతీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాను ఇదే హాస్టల్ లో రెండేళ్లు గడిపానని, తానూ ర్యాగింగ్ బాధితురాలినేనని పేర్కొంది.
“హాస్టల్‌లో ఉన్నప్పుడు నేను కూడా ర్యాగింగ్ బాధితురాలినే. సీనియర్లు.. నన్ను, వాళ్ల రూమ్స్ కు పిలిపించుకుని బాడీ మసాజ్ చేయమని అడడిగేవారు.. వాళ్లు వేసుకున్న బట్టలు ఉతకమనేవాళ్లు. ఒకవేళ వాళ్ల పనులకు ఎదురుచెబితే హింసించేవాళ్లు. ఈ విషయం హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఏ ఉపయోగం లేకపోయేది. వాళ్లు పట్టించుకునేవాళ్లు కాదు. పైగా నన్నే తిట్టేవాళ్లు. అదీగాక నా పేదరికాన్ని చూపి నానా మాటలనేవాళ్లు. దాంతో నేను చాలా విసిగిపోయా..” అని ద్యుతీ పేర్కొంది.
“Didis used to force me to massage their bodies and wash their clothes at the Sports Hostel.”
Dutee Chand opens up about the horror times she had to endure during her stay at a Sports Hostel in Bhubaneswar.#Athletics | @DuteeChand https://t.co/EQyqjIyZQs
— The Bridge (@the_bridge_in) July 4, 2022
ద్యుతీ.. 2006 నుంచి 2008 వరకు ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ స్పోర్ట్స్ హాస్టల్‌లో గడిపింది. ఇక డిగ్రీ చదువుతున్న రుచిక.. సీనియర్స్ పైశాచికత్వాన్ని భరించలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని లెటర్ రాసి తనువు చాలించింది. ప్రస్తుతం ఈ ఘటన ఒడిశా రాజకీయాల్లో సంచలనంగా మారింది. మహిళా క్రీడాకారిణులకు ఎదురవుతున్న ఇలాంటి చేదుఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Video: రీమిక్స్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసిన పీవీ సింధు!