టీమిండియా కోచ్ గా ద్రావిడ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొంచెం ప్రతికూల ఫలితాలు వచ్చినా.. టెస్టుల్లో మాత్రం భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు రావడానికి కోచ్ గా కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మాట్లాడిన ద్రావిడ్.. షాకింగ్ కామెంట్స్ చేసాడు.
భారత్- ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేపు జరుగనుంది. లండన్ లోని ఓవల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. భారత్ కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకి జరుగనుంది. స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇదిలా ఉండగా. ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ ఫైనల్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ద్రావిడ్ మాట్లాడిన మాటలు కాస్త ఆశ్చర్యంగా అనిపించాయి. మేము ఈ ఫైనల్ లో ఓడిపోయినా పర్లేదు అని చెప్పుకొచ్చాడు. మరి ద్రావిడ్ ఇలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా కోచ్ గా ద్రావిడ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొంచెం ప్రతికూల ఫలితాలు వచ్చినా.. టెస్టుల్లో మాత్రం భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు రావడానికి కోచ్ గా కీలక పాత్ర పోషించాడు. అయితే అన్నిటికీ మించి ద్రావిడ్ ఎదుట ఒక పెద్ద సవాలు నిలిచింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిపిస్తే గ్యారీ క్రిస్టెన్ తర్వాత టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించిన తొలి కోచ్ గా నిలుస్తాడు. అయితే ఇప్పుడు ద్రావిడ్ ఓడినా పర్లేదు అని ప్లేయర్లకు భరోసా ఇస్తున్నాడు. మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు ఒత్తిడిలో మాత్రం మ్యాచ్ ఆడవద్దు అని టీమిండియాకు ప్లేయర్లకి కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
“వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఖచ్చితంగా గెలవాలనే ఒత్తిడి మాపై లేదు. ఒకవేళ ఓడినా ఈ రెండు సంవత్సరాలలో మేము సాధించిన విజయాల విలువ తగ్గదు. గత రెండేళ్లుగా కష్టపడ్డారు కాబట్టి ముగింపుగా టోర్నీ ఇస్తే సంతోషిస్తాను. ఈ రెండేళ్లలో ఎక్కడ ఆడినా.. అక్కడ తనదైన ముద్ర వేసిన ఘనత టీమిండియా సొంతం. ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఆడడం చాలా ముఖ్యం”. అని ద్రావిడ్ తెలియజేశాడు. మరీ టీంఇండియా బాగా ఆడి కోచ్ గా ద్రావిడ్ కి టైటిల్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.