పేద వారిని ఆసరాగా తీసుకొని లక్షలు సంపాదించే డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లోఒక డాక్టర్ మాత్రం తన గోల్డెన్ హార్ట్ ని చాటుకొని మానవత్వానికి నిదర్శనంగా నిలిచాడు. కనిపించని దేవుడి గురించి మనకు తెలియదు గాని కనిపించే దేవుడు మాత్రం అతడే.
డాక్టర్ అయితే చాలు ఎంతో సంపాదించవచ్చు. లక్షలు, కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే వీరి సంపాదన ఊహించని రీతిలో ఉంటుంది. ఆపరేషన్ చేయాలంటే డబ్బులు కట్టాల్సిందే. ఎంత అత్యవసర పరిస్థితి అయినా అస్సలు కనికరం చూపించారు. ఈ భూమి మీద ప్రాణాలు కాపాడగలిగేది కేవలం డాక్టర్లు మాత్రమే. అందుకే సమాజంలో వీరికి ఎక్కువగా డిమాండ్ తో పాటు గౌరవం కూడా లభిస్తుంది. డబ్బు ప్రాణాలు కాపాడగలిగే డాక్టర్లని మనం దైవంగా చూస్తాము. అలాంటిది ఉచిత వైద్యం చేసే డాక్టర్ ని ఎలా చూడాలి? వినడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్న ఒక డాక్టర్ చేసే పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఇక పూర్తి వివరాళ్లోకేతే..
అతని పేరు శంకర్ గౌడ్. కర్ణాటకలోని మాండువాలో నివాసం ఉంటున్నాడు. కలకత్తా మెడికల్ యూనివర్సిటీలో MBBS గోల్డ్ మెడలిస్ట్.అయితే అంత చదువుకున్న, కావాల్సినంత ప్రతిభ ఉన్న అతనికి సొంత క్లినిక్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయినా పేదలకు సేవ చేయాలనే ఆయన సంకల్పం మాత్రం ఆగలేదు. కలకత్తా లోని ఒక విలేజ్ కి కొంత దూరంలో రెండు రూమ్ లు కలిగి ఉన్న ఒక ఇంటిలో నివాసముంటున్నాడు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ముందు ఒక చిన్న సైకిల్ మీద కూర్చొని కొన్ని వందల మంది పేద వారు వారి దగ్గరకు వచ్చి వైధయ్మ చేపించుకొని వెళ్తారు. అతను చూడడానికి ఎంత సింపుల్ గా ఉంటాడంటే.. ఎలాంటి ఆడంబరం లేకుండా చాలా సాధారణ దుస్తులు ధరిస్తాడు. అతని కళ్ళకు చెప్పులు కూడా ఉండకపోగా కేవలం మూడు రూపాయల పెన్ మాత్రమే వాడడం విశేషం.
ఇంతలా ప్రజలకు చేసే వైద్యానికి ఎంత ఈ డాక్టర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అక్షరాలా 5 రూపాయలు. వినడానికి తమిళ్ సూపర్ స్టార్ నటించిన అదిరింది సినిమా మాదిరి ఉన్నా.. రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే మన అదృష్టంగా భావించాలి. పేద వారిని ఆసరాగా తీసుకొని లక్షలు తీసుకునే డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో శంకర్ గౌడ్ మాత్రం తన గోల్డెన్ హార్ట్ ని చాటుకొని మానవత్వానికి నిదర్శనంగా నిలిచాడు. కనిపించని దేవుడి గురించి మనకు తెలియదు గాని కనిపించే దేవుడు మాత్రం డాక్టర్ శంకర్ గౌడ్.