ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ హఠాన్మరణంపై జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. షేన్ వార్న్ ఉన్న విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్‌పై రక్తపు మరకల్ని గుర్తించినట్లు థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన కో సముయ్‌కు వెకేషన్‌కు వెళ్లిన 52 ఏళ్ల వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కానీ వార్న్ ఉన్న రక్తపు మరకలు ఉండడంతో అతని మృతిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వార్న్ నిజంగానే గుండెపోటుతో మరణించాడా? లేక ఎవరైనా హత్య చేశారనే అని అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానీ విచారణ జరుపుతున్న థాయ్ పోలీసులు వార్న్ గదిలో రక్తపు మరకలు ఉన్నది నిజమేనని కానీ.. అది వార్న్ దగ్గడంతో వచ్చిన రక్తమని తెలిపారు. దీంతో వార్న్ మృతిని అనుమానస్పద మృతిగా తాము భావించడం లేదని థాయ్ పోలీసులు పేర్కొన్నారు. అచేతనంగా పడి ఉన్న వార్న్‌ను చూసిన అతని ఫ్రెండ్స్ వెంటనే సీపీఆర్ చేశారు. ఆ సమయంలో వార్న్ దగ్గడంతో రక్తం వచ్చింది. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం వార్న్ డాక్టర్‌ను కలిశాడు. దీనిని అనుమానాస్పద మృతిగా భావించట్లేదు’ అని పోలీసులు వివరంగా చెప్పుకొచ్చినట్లు సమాచారం.
‘మ్యాచ్‌ల కామెంట్రీ కోసం ఇంగ్లండ్ వెళ్లే ముందు దొరికిన సమయాన్ని గడిపేందుకు వార్న్ థాయ్‌లాండ్‌కు వచ్చాడు. మరణానికి ముందు అతను మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోను కలిసి భోజనం చేయాలనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మరికొంత మందిని వార్న్, నియోఫిటో కలవాలనుకున్నారు. పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనికి ఏదో అయిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు. హృదయ స్పందన లేకపోవడంతో సీపీఆర్ చేశాడు.
20 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఓ గంట తర్వాత వార్న్ చనిపోయాడనే విషయం తెలిసింది. అతన్ని రెండు గంటల ముందు చివరగా చూశా. అతనెక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నాడు” అని సుదీర్ఘ కాలంగా వార్న్ మేనేజర్‌గా ఉన్న జేమ్స్ చెప్పాడు. మరోవైపు ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే వార్న్ ప్రాణాలు పోయాయని థాయ్ అంతర్జాతీయ ఆసుపత్రి వెల్లడించింది. మరి వార్న్ మృతి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Flowers and memorabilia have been placed by fans at the statue of Shane Warne outside the MCG to honour the legspin legend 💚 pic.twitter.com/Sn5GeEoRBE
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2022