వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో విండీస్ పర్యటనలో టీమిండియా వరుస విజయాల జోరుకు అడ్డుకట్ట పడింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ఐదు టీ20ల సిరీస్‌ను విజయంతో శుభారంభం చేసిన విషయం తెలిసిందే. కానీ.. రెండో టీ20లో మాత్రం టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా.. బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది.
దీనికి తోడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ కూడా ఓటమి కారణమైందని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిలా కొత్తగా ట్రై చేద్దామనుకుని మ్యాచ్‌ను పొగట్టాడంటూ రోహిత్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఫోర్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లంతా విఫలయ్యారు. ఒబెడ్ మెక్కాయ్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు.
మెక్కాయ్ ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్(11), శ్రేయస్ అయ్యర్(10) కూడా తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యారు. రిషభ్ పంత్(24), హార్దిక్ కొంత పోరాడినా హోస్సెన్ దెబ్బతీసాడు. చివర్లో అశ్విన్, కార్తీక్ కూడా విఫలమయ్యారు. మెక్కాయ్ 6 వికెట్లతో పాటు హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసఫ్ తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్‌మైర్(6), రోవ్‌మన్ పొవెల్(5) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యమే అయినా మ్యాచ్‌ను భారత బౌలర్లు ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లారు.
చివరి మూడు ఓవర్లలో విండీస్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన హార్దిక్ 11 పరుగులిచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన అర్షదీప్.. డేంజరస్ పోవెల్‌ను ఔట్ చేయడంతో పాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆశలు రేకెత్తాయి. చివరి ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్ వేస్తాడని అంతా భావించారు. కానీ.. ఆశ్చర్యకరంగా కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని ఆవేశ్ ఖాన్ చేతికి ఇచ్చాడు. చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. ఆవేశ్ ఖాన్ తొలి బంతినే నోబాల్‌గా వేశాడు. దాంతో ఫ్రీ హిట్ అవకాశాన్ని అందుకున్న డెవన్ థామస్ భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.
చివరి ఓవర్‌లో ఆవేశ్‌ఖాన్ అనుభవంలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన భువీ కేవలం 12 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్ భువీ వేసి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని గతంలో కీలక సమయాల్లో ఊహించని బౌలింగ్ మార్పులతో ఫలితాలు రాబట్టేవాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో చివరి ఓవర్‌ను జోగిందర్ శర్మతో వేయించి అందర్ని షాక్ గురిచేసిన ధోని.. మిస్బాను అవుట్ చేయించి కప్ అందించాడు. ఆ తర్వాత అలాంటి ఊహకందని నిర్ణయాలు ఎన్నో ధోని తీసుకుని సక్సెస్ అయ్యాడు.
తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ కూడా ధోనిలా ప్రయోగం చేశాడని.. సక్సెస్ కాకపోగా.. మ్యాచ్‌ను పొగొట్టాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రెండు ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చిన భువనేశ్వర్ కుమార్‌ను కాదని.. ఆవేశ్ ఖాన్‌తో చివరి ఓవర్ వేయించి ఓటమికి కారణం అయ్యాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన రోహిత్ శర్మ.. భువీ ఇలాంటి డెత్ ఓవర్స్ చాలా వేశాడని.. ఆవేశ్ ఖాన్ లాంటి యువ క్రికెటర్లకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్‌చేసే అవకాశం కల్పించాలని.. అందుకే ఆవేశ్‌కు లాస్ట్ ఓవర్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia put up a solid fight but it was the West Indies who won the second #WIvIND T20I.
We will look to bounce back in the third T20I. 👍 👍
Scorecard 👉 https://t.co/C7ggEOTWOe pic.twitter.com/OnWLKEBiov
— BCCI (@BCCI) August 1, 2022
Rohit Sharma explains why he picked Avesh Khan to bowl the final over of the match 🗣
Defending 10 off the last six balls, the bowler conceded a no ball and two boundaries 👉 https://t.co/sqZG5vJwzh #WIvIND pic.twitter.com/LOOgcaORNc
— ESPNcricinfo (@ESPNcricinfo) August 2, 2022