వన్డేల్లో దారుణమైన ఫామ్‌తో.. వరుసగా మూడు గోల్డెన్ డక్‌లతో అత్యంత చెత్త రికార్డును సూర్య తన పేరిట లిఖించుకున్నాడు. దీంతో సూర్య కంటే శాంసన్ బెటర్ అంటూ అభిమానులు పేర్కొంటున్న తరుణంలో.. సూర్యను శాంసన్‌తో పోల్చొద్దని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సూర్యకుమార్ యాదవ్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కి ముందు ఇండియన్ క్రికెట్ జట్టులో సూపర్‌స్టార్. కానీ.. ఒక్క సిరీస్ అతని ఇమేజ్‌నా దారుణంగా డ్యామేజ్ చేసింది. ఇటివల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్య.. అన్ని మ్యాచ్‌ల్లోనూ దారుణంగా గోల్డెన్ డక్ అయ్యాడు. హ్యాట్రిక్ గోల్డెన్ డక్‌లతో ప్రపంచంలో ఇలా అవుటైన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో సూర్యకుమార్‌ను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం చేయాలని.. అతన్ని వన్డే జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో సంజు శాంసన్‌కు అవకాశం కల్పించాలనే డిమాండ్ వ్యక్తం అయింది.
సూర్య కంటే సంజు వన్డేల్లో చాలా బెటర్ అని.. జట్టులో రాజకీయాలు చేస్తూ శాంసన్ కెరీర్‌ను నాశనం చేస్తున్నారంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. కాగా.. టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను వన్డేల్లోనూ ఆడించి.. ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో సూర్యను కీ ప్లేయర్‌గా మార్చుకోవాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ భావించారు. అందుకే సూర్యను వన్డేల్లో బ్యాక్ చేస్తూ వచ్చారు. కానీ.. సూర్య దారుణంగా విఫలం అవ్వడంతో అతన్ని జట్టులో కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అదే సమయంలో సంజు శాంసన్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని, సూర్య ప్లేస్‌లో అతన్ని టీమ్‌లోకి తీసుకోవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేశారు. అయితే.. సూర్యను సంజు శాంసన్‌తో పోల్చడాన్ని దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తప్పుబట్టారు. సూర్యను శాంసన్‌తో పోల్చవద్దని, బాగా ఆడుతున్న ఆటగాడ్ని టీమ్ బ్యాక్ చేయడంలో తప్పులేదని, సూర్య విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని సమర్ధించాడు. ఇప్పుడు సూర్య విఫలం అయ్యాడని శాంసన్ పేరు చెబుతున్నారు. రేపు ఇదే ప్లేస్‌లో శాంసన్ ఉంటే.. వేరే పేరు చెప్తారు. జట్టుకు ఒక ఆటగాడు అవసరం అనుకుంటే.. బ్యాక్ చేయడంలో తప్పులేదని కపిల్ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Former India skipper Kapil Dev has opened up on the comparison between Suryakumar Yadav and Sanju Samson.#KapilDev | #SuryakumarYadav | #SanjuSamson pic.twitter.com/2qtfPDEWuv
— Cricket.com (@weRcricket) March 24, 2023