టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నంత కాలం.. టీమిండియాలో కీపర్, ఫినిషర్ రోల్‌కు మరో పేరు వినిపించకుండా చేశాడు. కానీ.. ధోని రిటైర్మెంట్ తర్వాత.. అతని వారసుడిగా పంత్ కనిపించాడు. కానీ.. ప్రతిష్టత్మక టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు పంత్ ఫామ్ కోల్పోవడం.. అదే సమయంలో ఐపీఎల్ 2022లో టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆర్సీబీ టీమ్‌లో ఫినిషర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చడంతో అతన్ని జాతీయ జట్టులోకి తీసుకోకతప్పలేదు. ఇక వరల్డ్ కప్ కోసం డీకేను జట్టులో వికెట్ కీపర్ కమ్ ఫినిషర్‌గా కొనసాగించారు. వరల్డ్ కప్‌లోనూ డీకేకే ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. కానీ.. డీకే అనుకుంత స్థాయిలో రాణించలేదు. ధోని తర్వాత తానే అనుకున్న తరుణంలో పంత్‌కు డీకే రూపంలో పోటీ ఎదురైంది. కానీ.. వయసు రిత్యా డీకే ఎక్కువ కాలం ఆటలో కొనసాగే అవకాశం లేకపోవడంతో.. పంత్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.
కానీ.. తాను పరుగులు చేయకుంటే.. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ రూపంలో తన స్థానానికి ఎసరు పెట్టే యువ క్రికెటర్ పక్కలో బల్లెంలా ఉండనే ఉన్నాడు. ఇప్పటికే పంత్‌తో పాటు న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు సంజూ కూడా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత విశ్రాంతి తీసుకున్న దినేష్ కార్తీక్ పంత్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. రిషభ్ పంత్ ఎలాంటి సామర్థ్యం ఉన్న ఆటగాడో అందరికి తెలుసని.. పవర్ ఫుల్‌గా బిగ్ హిట్స్ ఆడగల టాలెంట్ పంత్‌లో ఉందని అందుకే.. అతన్ని ఓపెనర్‌గా ఆడిస్తే.. చాలా బాగుంటుందని డీకే అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లే సమయంలో ఫీల్డ్ రిస్టిక్షన్స్ ఉంటాయని.. పంత్ ఓపెనర్‌గా ఆడితే.. సర్కిల్ ఫీల్డ్‌ను క్లియర్ చేసి బిగ్ హిట్స్ ఆడతాడని డీకే పేర్కొన్నాడు.
ఇక తనకంటే కూడా పంత్ మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయగలడని.. అతన్ని లోయర్ ఆర్డర్‌లో కాకుండా.. ఓపెనర్‌గా ఆడిస్తే మంచి ఫలితం ఉంటుందని డీకే అన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో పంత్‌ను ఓపెనర్‌గా ఆడించే అవకాశం కూడా ఉంది. ఇక డీకే చెప్పిట్లు పంత్‌ను ఓపెనర్‌గా పంపిస్తే.. లెఫ్ట్, రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. ఇక పంత్‌తో తనకున్న పోటీని సైతం పక్కన పెట్టిన డీకే.. ఇలా పంత్‌లో ఉన్న ఎబిలిటీని గుర్తించి అతన్ని ఓపెనర్ చేయమనడం ఫ్యాన్స్ స్పందిస్తూ.. తన వారసుడిగా పంత్‌ను డీకే చెప్పకనే చెప్పాడని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మంచి స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడంలో తన తర్వాత పంత్ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఎంతో కీలకంగా మారతాడని డీకే అభిప్రాయపడ్డాడు.
His strike rate is highest when he opens in T-20 for India: Kartik on Pant#DK #pant #CricketTwitter @RishabhPant17@DineshKarthik pic.twitter.com/HtBVgyMCYv
— The Offpitch Buzz (@TheOffpitchBuzz) November 19, 2022