ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు దినేష్ కార్తీక్ సంచలన ఇన్నింగ్స్ ఆడి.. ఐపీఎల్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు హెచ్చరికలు జారీ చేశాడు.
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత సైలెంట్ అయిన డీకే.. తాజాగా 38 బంతుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. డీవై పాటిల్ టోర్నమెంట్‌లో డీవై పాటిల్ గ్రూప్ బీ తరఫున ఆడిన డీకే.. సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్బీఐ-డీవై పాటిల్ గ్రూప్ బీ మధ్య జరిగిన మ్యాచ్‌లో డీకే తన పవర్ హిట్టింగ్‌తో విశ్వరూపం చూపించాడు. కేవలం 38 బంతులు ఆడి 5 పోర్లు, 6 సిక్సులతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అయితే వరుసగా 4,6,6,6తో అదరగొట్టాడు. డీకే హాఫ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డీవైపీ గ్రూప్ బీ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఆర్బీఐ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసి.. 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇందులో డీకే ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఎప్పుడో ధోని కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ.. ధోని టీమిండియాలో పాతుకుపోయి కెప్టెన్ అయినా తర్వాత డీకేకు పెద్దగా అవకాశాలు రాలేదు. అడపాదడపా టీమిండియాలో కనిపించేవాడు. కొన్ని ఏళ్ల తర్వాత వ్యక్తిగత జీవితంలోని సమస్యలతో క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అక్కడితోనే డీకే క్రికెట్ కెరీర్ కూడా ముగిసిపోయిందని అన్నారు. డీకే సైతం బ్యాట్‌ను పక్కనపెట్టి మైక్ పట్టుకుని కామెంటేటర్‌గా మారిపోయాడు. ఒక వైపు ఐపీఎల్‌లో ఆడుతన్నా.. జాతీయ జట్టులోకి వచ్చే ప్రయత్నం చేయలేదు.
కానీ.. తాను వెళ్తున్న దారి సరికాదని మళ్లీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టిన డీకే.. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున బరిలోకి దిగి ఫినిషర్‌గా అద్భుతంగా రాణించాడు. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన డీకే.. పలు సిరీస్‌లలో రాణించి, ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022కు ఎంపికయ్యాడు. కానీ.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో మళ్లీ జట్టుకు దూరం అయ్యాడు. అయితే.. ఐపీఎల్ 2023 సీజన్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి తన బ్యాటింగ్‌కు పదునుపెట్టాడు. ఈ క్రమంలోనే డీవై పాటిల్ టోర్నమెంట్‌లో పాల్గొని ఆర్బీఐ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపాడు. అయితే.. డీకే నిదాస్ ట్రోఫీ ఫైనల్లో ఆడిన సంచలన ఇన్నింగ్స్ అతని కెరీర్‌లోనే గొప్ప ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది. ఆ ఇన్నింగ్సే డీకేను హీరోని చేసి, ఫినిషర్‌గా నిలబెట్టింది. మరి డీకే కెరీర్‌తో పాటు డీవై పాటిల్ టోర్నీలో ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dinesh Karthik smashed 75* from just 38 balls including 5 fours & 6 sixes in his first match in the DY Patil tournament.
DK is preparing well ahead of the IPL. pic.twitter.com/ta6yf7CP5A
— Johns. (@CricCrazyJohns) February 21, 2023
Dinesh Karthik Scored 75*(38) in DY Patil T20 Match Today 🔥 pic.twitter.com/6QsElW2QhS
— Junaid Khan (@JunaidKhanation) February 21, 2023