బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో ఓటమి చెందింది. ఇక ఈ మ్యాచ్ లో బ్యాటర్లు సమష్టిగా విఫలం కావడంతో భారత జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది. అద్బుతంగా బౌలింగ్ చేసిన బంగ్లా బౌలర్లు టీమిండియా టాపార్డర్ ను త్వరగా పెవిలియన్ కు పంపి మ్యాచ్ పై పట్టు సాధించారు. అయితే చివర్లో టీమిండియా చెత్త ఫీల్డింగే కొంప ముంచిందని వ్యాఖ్యానించాడు డానిషింగ్ బ్యాటర్ కమ్ సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్. ఈ మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ పై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
“ఇంత దారుణమైన ఫీల్డింగ్ ను నేను ఊహించలేదు. ఈ రోజు టీమిండియా చెత్త ఫీల్డింగ్ ను చూస్తుంటే నేనెంతో అసంతృప్తికి లోనైయ్యాను” అని బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డే తర్వాత టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ అన్న మాటలు. ఆ రెండు క్యాచ్ లు పట్టి ఉంటే టీమిండియా సునాయసంగా గెలిచేదని డీకే చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ గురించి, కేఎల్ రాహుల్ చెత్త కీపింగ్, వాషింగ్టన్ సుందర్ బద్దకమైన ఫీల్డింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు దినేష్ కార్తిక్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ..”ఈ రోజు టీమిండియా ఫీల్డింగ్ ను చూస్తుంటే నాకు అసంతృప్తి కలుగుతోంది. ఇంత దారుణమైన కీపింగ్ ను, ఫీల్డింగ్ ను నేను ఇప్ఫటి వరకు చూడలేదు. అనుభం ఉన్న కేఎల్ రాహుల్ కూడా ఇలా ఆడటం ఏంటో నాకు అర్థం కావడం లేదు” అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు.
చివర్లో కేఎల్ రాహుల్ క్యాచ్ వదిలేశాడు. అది అతడి తప్పిదమే. కానీ వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టేందుకు కనీసం ముందుకు రాకపోవడం ఏంటని ప్రశ్నించాడు దినేష్ కార్తిక్. అతడికి అక్కడున్న లైటింగ్ వల్ల బాల్ కనిపించలేదా? లేదా కావాలనే బాల్ ను అందుకోడానికి కదలలేదా? ఈ ప్రశ్నలకు సమాధానం అతడే చెప్పాలి అంటూ డీకే పేర్కొన్నాడు. టోటల్ గా ఈ మ్యాచ్ లో ఫీల్డర్లు మెప్పించలేకపోయారు అంటూ మండిపడ్డాడు. అయితే చివర్లో కొన్నిబౌండరీలను ఒత్తిడి కారణంగా వదిలేసి ఉంటారి ఈ సందర్భంగా డీకే చెప్పుకొచ్చాడు. ఇక సింపుల్ క్యాచ్ పడదానికి ముందుకు రాని వాషింగ్టన్ సుందర్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నోరు పారేసుకున్న వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.