IPL పుణ్యమాని టీమిండియాలోకి ఎంతో నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లు వస్తున్నారు. భారత్ లో ఉన్న యువ ఆటగాళ్లను వెలికితీయటానికి ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే కొంత మంది సీనియర్ ప్లేయర్స్ మాత్రం ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నారు. దానికి కారణం వయసు మీద పడటంతో.. అద్బుతమైన ఆటగాళ్ళు అయినప్పటికీ వారిని ఐపీఎల్ మెగావేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ఆటగాడిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత డాషింగ్ ఫినిషర్ దినేష్ కార్తిక్. ఆ టీమిండియా ఆటగాడు ఐపీఎల్ కు పనికిరాడు అని తేల్చి చెప్పాడు డీకే.
“నిజం చెప్పాలంటే అతడికి ఐపీఎల్ లో ఆడాలని చాలా ఆసక్తి ఉంది. పైగా చాలా కాలం పాటు ప్రయత్నించాడు కూడా. అయితే అతడు టీ20లకు సెట్ కాడని గ్రహించాడు. అదీకాక ఏ ఫార్మాట్లో ఆడితే బాగుటుందో అతడికి స్పష్టంగా తెలుసు” అని టీమిండియా స్టార్ బ్యాటర్ నయా వాల్ చతేశ్వర్ పుజారా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దినేష్ కార్తిక్. ప్రముఖ క్రీడా సైట్ క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పుజారా గురించి మరింతగా మాట్లాడుతూ..”పుజారా ఐపీఎల్ లాంటి టీ20 టోర్నీలకు సెట్ కానని ముందే గ్రహించాడు. అందుకే మేమంతా ఐపీఎల్ ఆడుతుంటే అతడు మాత్రం కౌంటీల్లో ఆడి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటాడు. తానేంటో నిరూపించుకోవడానికి పుజారా కౌంటిల్లో ఆడడు” అంటూ డీకే పేర్కొన్నాడు.
తాజాగా బంగ్లాతో జరిగిన తొలి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 90 రన్స్, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో చేసిన సెంచరీ చాలా స్పెషల్.. ఎందుకంటే తన ఆటకు విరుద్దంగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఈ నయా వాల్. ఈ మ్యాచ్ లో 130 బంతుల్లో 102 పరుగులు చేశాడు. తాజాగా అతడి బ్యాటింగ్ చూసిన అభిమానులు పుజారాను ఐపీఎల్ లో చూడాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దినేష్ కార్తిక్ పుజారాపై కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2021లో పుజారా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ లో కూడా అతడికి అవకాశం దక్కలేదు. ఇక 2022లో అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం మరోసారి తనపేరును IPL-2023 రిజిస్టర్ చేసుకున్నాడు పుజారా. ఈ క్రమంలోనే పుజారాను హైదరాబాద్ సన్ రైజర్స్ కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘#CheteshwarPujara has re-cemented his #3 spot in #India‘s XI,’ opines @DineshKarthik, on #CricbuzzChatter#BANvIND pic.twitter.com/RIdj61sItN
— Cricbuzz (@cricbuzz) December 18, 2022