సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022 సీజన్ చాలా అసక్తికరంగా మారుతోంది. 5 టీ20ల సరిసీస్ లో మొదటి రెండు టీ20 మ్యాచుల్లో ఓడిన భారత్.. తర్వాతి రెండు మ్యాచుల్లో వరుస విజయాలు నమోదు చేసింది. శుక్రవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 82 పరుగుల ఆధిక్యంతో ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. టాప్ ఆర్డర్ నిలదొక్కుకోవడానికి బాగా ఇబ్బంది పడింది. గైక్వాడ్(5), శ్రేయాస్(4), పంత్(17) నిలదొక్కుకోలేకపోయారు. ఇషాన్ కిషన్(27) పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు), దినేష్ కార్తీక్(27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు) ఇద్దరూ కలిసి సఫారీ బౌలర్లను కంగారు పెట్టారు.
81 పరుగులకు 4 వికెట్ల స్థితి నుంచి ఐదు వికెట్ నష్టానికి స్కోరు 146 పరుగలకు చేర్చారు. ముఖ్యంగా దినేష్ కార్తీక్ మరో ఏబీ డివిలియర్స్ లా 360 డిగ్రీల కోణంలో బాల్ ఎటు వచ్చినా బౌండరీకి తరలించాడు. అంతేకాకుండా 2006లో టీ20ల్లో అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్.. 16 ఏళ్ల తర్వాత టీ20ల్లో తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. హార్దిక్, డీకే చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ గు దిగిన సౌత్ ఆఫ్రికాని టీమిండియా బౌలర్లు నానా తిప్పలు పెట్టారు. సఫారీల కెప్టెన్ బవుమా రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ చేరగా.. డీకాక్ రనౌట్ అవ్వడం ఇలా వారికి అన్నీ వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.
5⃣0⃣ for @DineshKarthik! 👏 👏
A cracking knock this is as he brings up a 26-ball half-century. 👌 👌
Follow the match ▶️ https://t.co/9Mx4DQmACq #TeamIndia | #INDvSA | @Paytm pic.twitter.com/maOXqIIOf6
— BCCI (@BCCI) June 17, 2022
టీమిండియాపై రాజ్ కోట్ల్ లో సౌత్ ఆఫ్రికా టీ20 హిస్టరీలోనే అత్యల్ప స్కోరు.. 87 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డుస్సెన్(20), డీకాక్(14), జాన్‌సెన్(12) తప్ప మరెవరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన దినేష్ కార్తీక్ పై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాకుండా దినేష్ కార్తీక్ తో పంత్ ను పోలుస్తూ.. వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం పంత్ స్థానంలో డీకేకే అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
.@DineshKarthik put on an impressive show with the bat & bagged the Player of the Match award as #TeamIndia beat South Africa in Rajkot. 👏 👏
Scorecard ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/RwIBD2OP3p
— BCCI (@BCCI) June 17, 2022
పంత్ కన్నా దినేష్ కార్తీక్ ఎంతో గొప్ప ఫినిషర్ అని.. పంత్ ఈ మధ్య అనవసరపు షాట్స్ ఆడి త్వరగా పెవిలియన్ చేరుతున్నాడంటూ విమర్శిస్తున్నారు. డీకే వయసుని చూడకుండా.. ఆటను చూసి అతడిని ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ కోసం తప్పకుండా ఎంపిక చేయాలంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రేక్షకులు సైతం పంత్ ని పక్కపెట్టండి.. డీకే ఉన్నాడు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. పంత్ స్థానంలో దినేష్ కార్తీక్ ఆడించడమే కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.