టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా డీకే కొంతసేపు ముచ్చటించాడు. నెటిజన్లు నుంచి ఎదురైన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పాడు. ‘ఆస్క్‌డీకే’ హ్యాష్ ట్యాగ్‌తో సాగిన ఈ చిట్‌చాట్‌లో అభిమానులు, నెటిజన్ల నుంచి ఎదురైన ప్రశ్నలకు డీకే ఆన్సర్ చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఎవరు ఆడతారని అనుకుంటున్నారు? మాజీ క్రికెటర్లలో ఎవరితో డ్రెస్సింగ్‌రూమ్ షేర్ చేసుకోవాలని అనిపించింది? రోహిత్ శర్మ, పాంటింగ్‌లలో ఎవరూ బాగా ఫుల్ షాట్ ఆడగలరు? బోర్దర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ సెంచరీ చేస్తాడా? షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా చూశారా? లాంటి పలు ప్రశ్నలకు డీకే సమాధానాలు ఇచ్చాడు. ఈ చిట్‌చాట్‌లో ఓ అభిమాని 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో దినేష్ కార్తీక్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ ప్రశ్నించాడు.
దీంతో.. దినేష్ కార్తీక్‌కు చిరాకు వచ్చినట్టు ఉంది. వెంటనే దాన్ని డిలీజ్ చేయాలంటూ కోరాడు. మరి డీకే సీరియస్‌గానే చెప్పాడా? లేక సరదాగా చెప్పాడనే అనే విషయంపై క్లారిటీ లేదు. ఎందుకంటే.. డీకే ఆ ప్రశ్నను పట్టించుకోకుండా ఉండి ఉంటే అది ఎవరికీ తెలిసేది కాదు. కానీ.. ఆ వ్యక్తి ఆడిగిన ప్రశ్నకు డీకే రియాక్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. డీకే చాలా సరదాగానే దాన్ని డిలీజ్ చేయమని చెప్పినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం అడిగాడని అనుకుంటున్నారా? 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతుంది. ఆ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ 25 బంతులాడి కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవుతాడు. ఈ గొప్ప ఇన్నింగ్స్‌పై ఒక్క మాటలో మీరు ఏం చెప్తారని ఆ నెటిజన్ డీకేను అడిగాడు.
ఆ వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో స్థానం కోల్పోయిన డీకే.. కామెంటేటర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. కానీ.. మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో డీకేను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొనుగోలు చేయడంతో.. ఆ జట్టు తరఫున ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. ఆ సీజన్‌లో ఆర్సీబీ తరఫున అద్భుత ఫినిషర్‌గా రాణించడంతో మరో సారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఎంపికయ్యాడు. ఎన్నో ఆశల మధ్య మళ్లీ టీమ్‌లోకి వచ్చిన డీకే.. వరల్డ్ కప్‌లో అవకాశాలు దక్కినా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరి డీకే కెరీర్‌పై అలాగే.. డీకేకి అభిమానికి జరిగిన చిట్‌చాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Delete this right now 🤦🏻♂️ https://t.co/lKsFtS7YUS
— DK (@DineshKarthik) February 7, 2023