టీమిండీయా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. తన కెరీర్ విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ టీమిండియా జట్టులోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తొలిసారిగా తన కెరీర్ విషయంలో స్పందించారు. ఫ్లోరిడా స్టేడియంలో జరిగిన చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. దినేష్ కార్తీక్ చాలా కాలంగా టీమిండియా జట్టుకు దూరంగా ఉన్నారు. ఫామ్ కోల్పోవడం వల్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశాలు లేవనుకుంటున్న దశలో ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకొచ్చారు. బ్యాటింగ్‌తో సత్తా చాటుతూ టీమ్‌లో మిస్టర్ డిపెండబుల్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఐపీఎల్ 2022లో దినేష్ కార్తీక్ అంటే ఏంటో ప్రూవ్ చేసారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్‌ను కొన్ని మ్యాచ్‌లలో ఒంటి చేత్తో గెలిపించిన సత్తా దినేష్‌ది. అందుకే ఆయన మళ్ళీ టీమిండియా జట్టులో సెలెక్ట్ అయ్యారు.
37 సంవత్సరాల వయస్సులో టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఐపీఎల్ తర్వాత టీ20 అంతర్జాతీయ సిరీస్‌లలో ఆడి సత్తా చాటిన దినేష్.. తొలిసారిగా కెరీర్ విషయంలో స్పందించారు. తాను మళ్ళీ సెలెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌నే కారణమని స్పష్టం చేశారు. ఆ ఇద్దరి సహకారం వల్లే తాను టీమ్‌లో కొనసాగుతున్నానని అన్నారు. తనపై వారిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా ఆడడానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లకి రిటర్మ్ గిఫ్ట్ ఇస్తానని వెల్లడించారు.
తాను మళ్ళీ భారత జట్టులో సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సంతోషకరమైన క్షణాలు ఇంకా ముందే రావాల్సి ఉందని అన్నారు. బ్యాటింగ్‌లో బౌలర్ ఎవరనేది పెద్దగా పట్టించుకోనని, తన టార్గెట్ కేవలం బంతి మాత్రమే అని, అతను ఎలాంటి బంతులు వేస్తాడనే దాని మీద ఫోకస్ చేస్తానని అన్నారు. పవర్ హిట్టింగ్ మీదే ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ చేస్తానని, ఎందుకంటే దాని వల్లే తన బ్యాటింగ్ గాడిన పడిందని వెల్లడించారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనేది తన కల అని, దాన్ని నిజం చేసుకునే అవకాశం వచ్చిందని వెల్లడించారు. మరి దినేష్ కార్తీక్ కమ్‌బ్యాక్‌పై మీ అభిప్రాయన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.