టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ మురళీ విజయ్.. జాతీయ జట్టులో స్థానం కోల్పోయి చాలా రోజులు గడిచిపోయాయి. అయినప్పటికి.. మురళీ విజయ్ మైదానంలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిచీ వారియర్స్ కు ఆడుతున్న విజయ్.. పరుగుల వరద పారిస్తున్నాడు. నెల్లాయి కోవై కింగ్స్ తో జరిగిన మ్యాచులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఇంతలోనే మురళీ విజయ్ చేదు అనుభవం ఎదురైంది. మురళీ విజయ్ జీవితంలో జరిగిన ఒక సంఘటనపై అభిమానులు ఆటపట్టించారు.
గురువారం సేలం స్పార్టన్స్, రూబీ ట్రిచీ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో సేలం స్పార్టన్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. మురళీ విజయ్ ఫీల్డింగ్ చేసేందుకు బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. దీంతో అభిమానులు మురళీ విజయ్‌ను ఆటపట్టించేందుకు డీకే – డీకే అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇబ్బందిగా ఫీలైన మురళీ విజయ్.. అభిమానులకు చేతులు జోడించి మరీ దండం పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Fans chanting DK DK in front of Murali Vijay.
Success Is the Best Revenge 😎 pic.twitter.com/UYyGoMKrnV— Virat is Universal GOAT 🐐 (@CricCrazyKohli) July 21, 2022
దినేష్ కార్తీక్ పేరు ఎందుకొచ్చిందంటే?
ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళీ విజయ్, దినేశ్ కార్తీక్.. ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితతో మురళీ విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకుని, వారిద్దరూ విడిపోవడానికి కారణమవ్వడం అందుకు కారణం.
మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళీ టోర్నీల్లో చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహారించే దినేశ్ కార్తీక్, 2007లో తన 21 ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్‌గా ఉన్న మురళీ విజయ్ కూడా హాజరయ్యాడు. ఆ తరువాత విజయ్, దినేశ్ కార్తీక్ ఇంటికి తరుచుగా వెళ్ళేవాడు. అలా నికితాకి దగ్గరైన మురళీ విజయ్, స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
2012 విజయ్ హాజారే ట్రోఫీ సమయంలో దినేశ్ కార్తీక్‌కి ఈ విషయం గురించి తెలిసింది. భార్య తనను మోసం చేసిందన్న బాధకంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేశ్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. విషయం తెలిశాక నికితాకి విడాకులు ఇచ్చాడు. దినేశ్ కార్తీక్‌కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అన్న విషయం తెలిసింది. దీంతో ఆ బిడ్డకు తానే తండ్రినని తెలుసుకున్న మురళీ విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నికితా, మురళీ విజయ్‌లకు ముగ్గురు పిల్లలు. నికితా, మురళీ విజయ్ ఇచ్చిన షాక్ నుంచి తేలుకోవడానికి మూడేళ్ల సమయం తీసుకున్న దినేశ్ కార్తీక్, 2015లో భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌తో ప్రేమలో పడ్డాడు. వీరికి ఇప్పుడు కవలపిల్లలు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Smriti Mandhana: గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగుతాం: స్మృతి మందాన
ఇది కూడా చదవండి: వీడియో: ప్యాడ్లు మరిచి బ్యాటింగ్ కు వచ్చిన బ్యాటర్.. గల్లీ క్రికెట్ ను తలపించిన లైవ్ మ్యాచ్!