టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ లాగే మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ భార్య చేతిలో దారుణంగా మోసపోయారు. మరి ఆ స్టార్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అందుకే పెళ్లి చేసుకునే ముందు వంద సార్లు ఆలోచించాలని, అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూసుకోవాలని అంటరు. అయితే కొందరి జీవితాల్లో పెళ్లిళ్ళు నింపే విషాదం అంతా ఇంతా కాదు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. భార్య చేతిలో మోసపోయిన ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు. కానీ వారిలో టీమిండియా స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ జీవితం కథ అత్యంత బాధాకరం. తన ప్రాణ స్నేహితుడు అయిన మరో క్రికెటర్ మురళి విజయ్ చేసిన మోసం దినేష్ కార్తీక్ తన జీవితంలో మర్చిపోలేడు. ఇక దినేష్ కార్తీక్ లాగే తమ భార్య చేతిలో మోసపోయిన మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఉన్నారని మీకు తెలుసా? మరి భార్య చేతిలో మోసపోయిన ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
దినేష్ కార్తీక్.. ఇతడి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏ క్రికెటర్ కూడా అనుభవించి ఉండడు. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నికిత వంజరను 2007 లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె దినేష్ కార్తీక్ ఫ్రెండ్ అయిన మురళి విజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దాంతో ఈ విషయం తెలుసుకున్న దినేష్ కార్తీక్ ఆమెకు విడాకులు ఇచ్చారు. అయితే విడాకులు ఇచ్చే సమయానికి ఆమె ప్రెగ్నెంట్ కావడంతో మరింతగా షాక్ కు గురైయ్యాడు దినేష్ కార్తీక్. అయితే భార్య తనను మోసం చేసింది అన్న బాధ కంటే.. ప్రాణ స్నేహితుడే తనను మోసం చేసినందుకు ఎక్కువ బాధపడ్డాడు డీకే. ఆ తర్వాత ఈ బాధ నుంచి కోలుకుని, స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డీకే జీవితం సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు.
ఇక అచ్చం ఇలాగే దినేష్ కార్తీక్ లాగా మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ భార్యల చేతిలో దారుణంగా మోసపోయారని మీకు తెలుసా? ఆ స్టార్ క్రికెటర్లు ఎవరో కాదు.. ఒకరు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ అయితే.. మరోకరు శ్రీలంక వెంటరన్ బ్యాటర్ దిల్షాన్. అవును వీరిద్దరు కూడా తమ భార్య చేతిలో మోసపోయారు. హెరాల్డ్ నివేదిక ప్రకారం.. బ్రెట్ లీ తన మెుదటి భార్య ఎలిజబెత్ క్యాంప్ కు విడాకులు ఇచ్చాడు. అయితే ఈ విడాకులకు ప్రధాన కారణం.. ఎలిజబెత్ కు బ్రిస్బేన్ కు చెందిన రగ్బీ ప్లేయర్ తో ప్రేమ వ్యవహారమే. ఈ విషయం తెలుసుకున్న బ్రెట్ లీ అమెకు విడాకులు ఇచ్చాడు. ఇక ఇదే జాబితాలో ఉన్న మరో క్రికెటర్ దిల్షాన్. ఇతడి కథ అచ్చంగా దినేష్ కార్తీక్ కథను పోలిఉంది. దిల్షాన్ భార్య నీలంక వితేంగే అతడిని వదిలేసి మరో లంక క్రికెటర్ అయిన ఉపుల్ తరంగను వివాహం చేసుకుంది. ఆ తర్వాత దిల్షాన్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన మంజులను 2008లో పెళ్లి చేసుకున్నాడు.