ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్లకు కొంచెం దూరంగా ఉండాలని దినేష్ కార్తీక్ వికెట్ కీపర్లను కోరారు. సోమవారం రిషబ్‌పంత్ పుట్టిన రోజు సందర్భంగా డీకే పంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పై విధంగా పేర్కొన్నాడు. సెప్టెంబర్ 28న ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో 17 ఓవర్ మొదటి బంతిని పంత్ సరిగ్గా ఆడలేదు. అదికాస్తా బ్యాట్‌కు తగిలి వికెట్ల మీద పడబోతుందని భావించి దాన్ని మళ్లీ బ్యాట్‌తో కొట్టబోయాడు. ఆ బంతిని అందుకునేందుకు ముందుకు వచ్చిన కీపర్ దినేష్ కార్తీక్ కొద్దిలో తప్పించుకున్నాడు. లేకుంటే దెబ్బ గట్టిగా తగిలి, ఊహించని ప్రమాదం జరిగి ఉండేది. రెప్పపాటులో తప్పించుకున్న కార్తీక్ షాక్ నుంచి తేరుకోగానే పంత్ అతని వద్దకు వెళ్లి సారీ చెప్పి డీకేను కూల్ చేశాడు. అందుకే పంత్ బ్యాటింగ్ చేసే టైమ్‌లో కీపర్లు కొంచెం దూరం ఉండాలని కార్తీక్ సరదాగా పేర్కొన్నాడు.
Happiest birthday to the one and only @RishabhPant17.
An advice to all keepers, stay a foot away from the stump when he’s batting 🤪 pic.twitter.com/oX7g2nOv4k— DK (@DineshKarthik) October 4, 2021