సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అలాగే ఇండస్ట్రీకి క్రీడలకు కూడా అవినాభావ సంబంధం ఉంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు రాజకీయ నాయకులను పెళ్లి చేసుకోవడం. అలాగే క్రీడా రంగాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్న జంటలను మనం చాలా మందినే చూశాం. అయితే సెలబ్రిటీల గురించి తెలిసినంతగా వారి కుటుంబ సభ్యుల గురించిన విషయాలు అంతగా తెలియవు. తాజాగా ఓ వార్త ఇటు సినిమా పరిశ్రలో.. అటు క్రీడాలోకంలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఓ స్టార్ క్రికెటర్ కూతురని చాలా మందికి తెలియకపోవడం. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
నమ్రత శిరోద్కర్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణిగా తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. అదీకాక నమ్రత హీరోయిన్ గా పలు సినిమాల్లో సైతం నటించింది. మహేశ్ తో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ.. ఫ్యామిలీ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇక మహేశ్ బాబు – నమ్రతలది ప్రేమ వివాహం అన్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. ఘట్టమనేని కోడలుగానే కాకుండా.. చారిటీల బాధ్యలతను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. కృష్ణ మరణంలో మహేశ్ బాబు కుటుంబంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే నమ్రతకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే నమ్రత శిరోద్కర్ తండ్రి ఓ స్టార్ క్రికెటర్ అని చాలా మందికి తెలీదు. నితిన్ పాండురంగ శిరోద్కర్.. రంజీ ట్రోఫీలో ముంబై తరపున ప్రాతినిధ్యం వహించాడు. 1967-68 కాలంలో దేశవాలీ క్రికెట్ లీగ్ లో ఆడాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తక్కువ రోజుల్లోనే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు నితిన్ శిరోద్కర్. ఇక నితిన్ క్రికెటర్ అన్న సంగతి చాలా మందికి తెలీదు.