మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెబితే చాలు టీమిండియా అభిమానులు గర్వంగా భుజాలెగరేస్తారు. ధోనీ అంటే మావాడు అని ఫీలవుతారు. 15 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన ధోనీ.. ఎన్నో రికార్డులు తన పేరిట సొంతం చేసుకున్నాడు. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే ఐపీఎల్ లో వన్ ఆఫ్ టాప్ క్లాస్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ధోనీకి గౌరవంగా ఓ చోట మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. అది కాస్త ఇప్పుడు కామెడీ అయిపోయింది. నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాకు టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించడంతోపాటు టెస్టుల్లో మన జట్టు నంబర్ 1 ర్యాంక్ సాధించడంలో ధోనీ కృషి మరువలేనిది. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ, ఐపీఎల్ వరకు పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి గౌరవార్ధం.. కర్ణాటక మైసూరులోని చాముండేశ్వరి వ్యాక్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా దాన్ని సందర్శన కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. దీంతో ఫ్యాన్స్.. విగ్రహం తయారు చేసిన వారిని ఓ ఆటాడేసుకుంటున్నారు.
ఎందుకంటే ధోనీలా విగ్రహం చేయాలనుకున్నారు కానీ అదికాస్త బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ని పోలినట్లు అనిపిస్తుంది. అస్సలు ధోనీలా ఏ మాత్రం అనిపించట్లేదు. ‘విగ్రహం ఉంది సరే ధోనీ ఎక్కడున్నాడు?’, ‘ఈ మైనపు విగ్రహం చేసినవాడు, ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ చేసినవాడు ఒకడే’, ‘విగ్రహం కాదు ఆ పక్కన నిలబడిన వాడు ధోనీలా కనిపిస్తున్నాడు’ అని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా 1983 ప్రపంచకప్ వీరుడు కపిల్ దేవ్ తో కలిసి గోల్ఫ్ ఆడుతూ ధోనీ కనిపించాడు. అలానే సచిన్ తో టెన్నిస్ ఆడుతూ మహీ కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే ధోనీ మైనపు విగ్రహంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
MS Dhoni wax statue in Mysore. pic.twitter.com/KdsKcPLsaM
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 7, 2022
Shut up that’s Shoaib not Dhoni 😭 https://t.co/QYvWWHXiid
— Inactive || Bunny 🍸 (@starlord_pro_) October 7, 2022
This has to one of the best MS Dhoni statue ever! 🔥 Not sure why ppl are finding it wrong. https://t.co/qfjBOhY2Rp pic.twitter.com/JcOkxB7HyA
— ɐslɐɯ (@pitchinginline) October 7, 2022
The artist who made this statue is the same who created VFX for Adipurush
— Sagar (@sagarcasm) October 7, 2022
Shoaib malik in indian cricket team jersey with diffrent hair style https://t.co/wMhx8SDFKC
— harRy (@HarRyMa52256977) October 7, 2022