ధోనీ క్రికెట్ లో తోపు అయ్యిండొచ్చు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేయడంలోనూ అదే మెంటైన్ చేస్తున్నాడు. ఈ లిస్టులో టాప్ లో నిలిచాడు. అవును మీరు విన్నది కరెక్టే. ఈ విషయమై ఇప్పటికే ధోనీపై చాలా కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పగానే క్రికెట్ ఫ్యాన్స్ ఊగిపోతారు. ప్రస్తుత ఐపీఎల్ లోనూ అదే జరుగుతోంది. చెన్నై ఆడిన ప్రతి మ్యాచ్ కు ధోనీని చూసేందుకు లక్షలాది మంది వస్తున్నారు. గోలగోల చేస్తూ అభిమానాన్ని చూపిస్తున్నారు. క్రికెటర్ గా ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలు సాధించిన ధోనీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కానీ ఇదంతా కాయిన్ కి ఓవైపు. మరోవైపు ధోనీపై వేలాది కేసులు నమోదవుతున్నాయి! ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ లిస్టులో సదరు మహేంద్ర సింగ్ ధోనీ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇంతకీ ఏం జరుగుతోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ధోనీ మాత్రమే కాదు చాలామంది సినీ, క్రికెట్ సెలబ్రిటీలు గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వాళ్లకు బాధ్యత పెరుగుతుంది. ఈ క్రమంలోనే వాళ్లు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ చాలామంది సెలబ్రిటీలు అలా అస్సలు చేయట్లేదు. డబ్బులు కోసం కక్కుర్తి పడిపోతున్నారు. ఓ వస్తువు లేదా బ్రాండ్ గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి, కనీస అవగాహన లేకుండా ప్రకటనల్లో నటించిన వారి లిస్టుని ASCI (అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేటరి బాడీ) బయటపెట్టింది. దీనిలో మహేంద్ర సింగ్ ధోనీ టాప్ ప్లేసులో నిలిచాడు.
పాపులారిటీతో దేశంలోనే టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ధోనీ.. రిటైర్మెంట్ తీసుకుని మూడేళ్లవుతున్నా సరే చాలా బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేస్తున్నాడు. అయితే ప్రజా సంక్షేమాన్ని ధోనీ అస్సలు పట్టించుకోడనే బ్యాడ్ నేమ్ ఉంది. ప్రజల శ్రేయస్సు కంటే డబ్బులకే ప్రాధాన్యం ఇస్తాడనే రిమార్క్ కూడా ఉంది. ఇప్పుడు ASCI లిస్ట్ బయటపెట్టడంతో అది కాస్త ప్రూవ్ అయింది. గతంలో అమ్రపాలి హౌసింగ్ స్కామ్ లో ధోనీ వల్ల చాలామంది ఫ్లాట్స్ కొనుగోలు చేసి మోసపోయారు. ప్రస్తుతం చేస్తున్న చాలా బ్రాండ్స్ విషయంలోనూ ధోనీని చూసి ప్రజలు ఆయా వస్తువుల్ని కొనేస్తున్నారు. వాటి నాణ్యత, ఇతరత్రా విషయాల్లో మోసపోయి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ధోనీతోపాటు చాలామంది సెలబ్రిటీలపై వేలకొద్ది కేసులు ఇప్పటికే నమోదైనట్లు తెలుస్తోంది.
అడ్వర్టైజింగ్ రూల్స్ ప్రకారం.. ప్రమోషన్ చేసే వస్తువు క్వాలిటీ, సంస్థ ప్రమాణాల లాంటి విషయాలపై బ్రాండ్ అంబాసిడర్ కు కనీస అవగాహన ఉండాలి. ఇలాంటివేం లేకుండా చాలామంది సెలబ్రిటీలు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో ధోనీ టాప్ లో ఉండగా, ఆ తర్వాత భువన్ బామ్, మాహీ లాంటి వాళ్లున్నారు. గత 55 ఏళ్లలో ఇలా సెలబ్రిటీల కారణంగా మోసపోయామని వస్తున్న ఫిర్యాదులు 80.3 శాతం పెరిగాయట. 503 అడ్వర్టైజ్ మెంట్స్ పై ఫిర్యాదులు వచ్చినట్లు ASCI స్పష్టం చేసింది. ఆన్ లైన్ గేమింగ్ తోపాటు క్లాసికల్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్ లాంటి యాడ్స్ వల్ల జనాలు మోసపోతున్నారు. చట్టంలోని లొసుగులతో సెలబ్రిటీలు తప్పించుకుంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. ప్రజా సంక్షేమం పట్టించుకోని లిస్టులో ధోనీ టాప్ లో నిలవడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.