టీమిండియా, ఐపీఎల్ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా సరే అందులో ధోనీ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తలా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మొన్నీ మధ్య గేల్, స్కాట్ స్టైరిస్, రాబిన ఉతప్ప, అనిల్ కుంబ్లే.. ఇలా అందరూ కూడా ఐపీఎల్ లో నిస్వార్థ క్రికెటర్ అంటే మహీ పేరే బల్లగుద్ది చెప్పారు. ఈ లీగ్ లో ఉండే ప్రతి ఒక్క ఆటగాడు కూడా ధోనీ కెప్టెన్సీలో ఒక్కసారైనా ఆడాలనుకుంటాడు. అలా అందరికీ ఫేవరెట్ అయిన ధోనీ.. కొన్నాళ్లలో మొదలయ్యే ఐపీఎల్ కొత్త సీజన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ధోనీ కొత్త పిక్ ఒకటి వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్, టీ20 క్రికెట్ లో బ్యాటర్ అనగానే గేల్ విధ్వంసమే గుర్తొస్తుంది. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు, అంతకు మించి అన్నట్లు ఉండే రికార్డులు.. ఓవరాల్ టీ20ల్లో సిక్సులు గానీ, అత్యధిక వ్యక్తిగత స్కోరు గానీ ప్రస్తుతానికైతే గేల్ పేరిటనే ఉన్నాయి. ప్రస్తుతం గేల్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ధోనీ మాత్రం ఐపీఎల్ మాత్రమే కొనసాగుతున్నాడు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ కలవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు ఎప్పుడు ఎక్కడ కలిశారు అనే విషయమై ఫ్యాన్స్ తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
ఐపీఎల్ ప్రమోషన్ లో భాగంగా కొన్ని వీడియోస్ చేస్తున్నారని.. దానికోసమే గేల్-ధోనీ ఒక్కచోట కనిపించారని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే.. వీళ్లిద్దరూ ఉన్న ప్రమోషనల్ వీడియో త్వరలో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈసారి ఐపీఎల్ మార్చి 20 నుంచి మే 28 వరకు జరగనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచులు ఆడనున్నాయి. మరోవైపు ధోనీకి ఈ సీజన్ చివరదనే టాక్ కూడా వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అభిమానులు బాధపడటం గ్యారంటీ. సరే ఇదంతా పక్కనబెడితే.. గేల్-ధోనీ పిక్ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.