టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులు, కార్లు అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. ధోని గ్యారేజ్‌లో ఖరీదైన బైకులు, కార్లు చాలానే ఉన్నాయి. తాజాగా మరో వింటేజ్ ల్యాండ్ రోవర్ కారు ధోని గ్యారేజ్‌కు చేరింది. గత నెలలో గురుగ్రామ్‌లో బిగ్ బాయ్ టాయ్జ్ (బీబీటీ) అనే షోరూం సంస్థ వేలం నిర్వహించింది. ఆ వేలంలో అనేక మంది ప్రముఖులతో పోటీ పడి మరి 1970 మోడల్‌కు చెందిన ల్యాండ్ రోవర్ 3 సిరీస్ కారును ధోని సొంతం చేసుకున్నాడు. ఈ విషయన్ని కారు వేలం నిర్వహించిన షోరూం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
దీంతో ధోని ఇంటి గ్యారేజ్‌లో మరో ల్యాండ్ రోవర్ కారు చేరబోతోంది. ఇది భారతదేశంలోని అరుదైన కార్లలో ఒకటిగా పేరు గాంచింది. అంతేకాకుండా ఆటో మొబైల్ రంగంలో ఈ కారుకు ప్రత్యేక స్థానం ఉంది. 1970 నుంచి 1985 మధ్య దేశంలో ఈ కార్లను తయారు చేశారు. అప్పట్లో ఈ కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉండేది. ఈ కారు మాన్యవల్ ట్రాన్స్ మిషన్‌తో నడుస్తుంది. మరి అంతటి ప్రత్యేక ఉన్న కారు కనుకనే ధోని వేలంలో దాన్ని దక్కించుకున్నాడు. మరి ధోని వింటేజ్ కారును సొంతం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోనీతో రాయ్ లక్ష్మీ లవ్ ట్రాక్.. అసలు నిజాలు బయటపెట్టిన నటి రాయ్ లక్ష్మీ!