టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆటతో పాటు పలు రకాల ఉత్పత్తుల ప్రచార ప్రకటనల్లో కూడా తన మార్క్ చూపిస్తుంటాడు. ఇప్పటికే అనేక బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించిన ధోని.. తాజాగా ఒక బిస్కెట్ల కంపెనీకి తన కూతురితో కలిసి యాడ్‌లో నటించాడు. ఈ యాడ్‌లో ధోని కూతురు జీవా ధోనిని.. ‘బూ..’అని భయపెడుతుంది. ధోనితో పాటు జీవాను అభిమానించే వాళ్లు చాలా మంది ఉన్నారు. దీంతో ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ధోని, జీవా కలిసి నటించిన ఈ యాడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.