సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తుంటారు. అయితే మంగళవారం దేశవ్యాప్తంగా కొంత సయయం వాట్సాప్ పనిచేయలేదు. దాంతో వాట్సాప్ వినియోగదారులు తెగ కంగారు పడ్డారు. చాలా వరకు మెసేజ్ లు సెండ్ అవ్వక గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్ దావల్ కులకర్ణి ట్వీటర్ లో అభిమానులతో కొంత సేపు చిట్ చాట్ చేశాడు. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పాడు. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగ్గా.. అల్లు అర్జున్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
దావల్ కులకర్ణి.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన టీమిండియా క్రికెటర్. టీమిండియా జట్టులో అడపా దడపా అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం భాగానే రాణిస్తున్నాడు. అయితే తాజాగా వాట్సాప్ కొంత సమయం ఆగిపోవడంతో.. కులకర్ణి ట్వీటర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. వారు అడిగి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. “వాట్సాప్ డౌన్ అయ్యి ఎంత సేపు అవుతుంది. రండి ఇక్కడ చాట్ చేద్దాం” అంటూ ట్వీట్ చేశాడు. దాంతో చాలా మంది అతడిని ప్రశ్నలతో ముంచెత్తాడు. మెుదటగా.. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటే.. సచిన్ టెండుల్కర్ అని బదులిచ్చాడు.
ఈ క్రమంలోనే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నట్లు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. ఇక మీకు నచ్చిన షారుఖ్ ఖాన్ మూవీ ఏది? అంటే ‘దిల్ వాలే దుల్హానీయా లేజాయింగే’ అంటూ చెప్పుకొచ్చాడు. మీకు ఇష్టమైన తమిళ్ హీరో ఎవరు? అని అడిగితే.. అల్లు అర్జున్ అని చెప్పాడు. కానీ అల్లు అర్జున్ తమిళ్లో యాక్ట్ చేయలేదుగా అని ఆ వ్యక్తి అడిగినా గానీ నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అనే చెప్పుకొచ్చాడు. యాక్టర్ విజయ్ గురించి ఒక్క మాటల్లో చెప్పండి అంటే.. డైనమిక్ అని సమాధానం ఇచ్చాడు. మీకు సమంత అంటే ఇష్టమేనా అంటే అవును ఇష్టమే అని అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా చాలా కొంత సేపు అభిమానులతో చిట్ చాట్ చేసి తన ఇష్టా ఇష్టాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
#WhatsAppDown since how long??
Let’s chat here 🤔 💭
Shoooooooot !!!!!!
— Dhawal Kulkarni (@dhawal_kulkarni) October 25, 2022
My fav South Indian actor is Allu Arjun
— Dhawal Kulkarni (@dhawal_kulkarni) October 25, 2022
DDLJ
— Dhawal Kulkarni (@dhawal_kulkarni) October 25, 2022