చాహల్ భార్య ధనశ్రీ.. తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు మాల్దీవుల్లో ప్రత్యక్షమైంది.
టీమిండియాలో ఏ క్రికెటర్ ని తీసుకున్నా సరే ఆయా ఆటగాడి భార్య కూడా ఫ్యాన్స్ కి పరిచయమే. ఈ లిస్టులో చాహల్ భార్య ధనశ్రీ కచ్చితంగా ఉంటుంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమె.. చాహల్ తో కలిసి తెగ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన గ్లామర్ తో కట్టిపడేస్తూ ఉంటుంది. రీసెంట్ గా కార్ రేసింగ్ చూడటం కోసం హైదరాబాద్ వచ్చిన ధనశ్రీ.. ఇప్పుడు మాల్దీవుల్లో ప్రత్యక్షమైంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాలో మోస్ట్ ఎంటర్ టైనింగ్ క్రికెటర్ అనగానే చాహల్ గుర్తొస్తాడు. ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన ఈ స్పిన్నర్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020లో డ్యాన్సర్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్లిద్దరూ మోస్ట్ ఎనర్జిటిక్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఐపీఎల్ కావొచ్చు, అంతర్జాతీయ మ్యాచులు కావొచ్చు.. చాహల్-ధనశ్రీ తెగ సందడి చేస్తూ ఉంటారు. గ్లామర్ విషయంలో ధనశ్రీ ఎప్పుడు నెటిజన్స్ ని ఆకట్టుకుంటూనే ఉంది.
రీసెంట్ గా హైదరాబాద్ లో సందడి చేసిన ధనశ్రీ.. ఆ వెంటనే మాల్దీవులు వెళ్లిపోయింది. అక్కడే స్విమ్ సూట్ లో తీసుకున్న రెండు ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సముద్రం బ్యాక్ గ్రౌండ్ కనిపించేలా ఉన్న ఆ ఫొటోస్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిని తీసింది చాహల్ అనిపిస్తుంది. ప్రస్తుతం టీమిండియా, ఆస్ట్రేలియాతో టెస్టులు ఆడుతోంది. ఈ జట్టులో చాహల్ లేడు. దీంతో తనకు దొరికిన ఫ్రీ టైంని భార్యతో కలిసి ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ధనశ్రీ లేటెస్ట్ ఫొటోలు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.