ఏబీ డివిలియర్స్ తన విధ్వంసకరమైన బ్యాటింగ్ శైలితో మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న క్రికెటర్. డివిలియర్స్ పేరుకు సౌతాఫ్రికా క్రికెటర్ అయినప్పటికీ అతనికి మన దేశంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ కారణంగా ఏబీడీని మనొళ్లు ఓన్ చేసుకున్నారు. కాగా వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్19 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. శనివారం ఇంగ్లండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో పాల్గొన్న సౌత్ ఆఫ్రికా లీగ్ దశలోనే ఇంటికి చేరినా.. ఆ జట్టులో ఒక ఆటగాడు మాత్రం ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.
ఈ టోర్రీలో 6 మ్యాచ్‌లు ఆడిన డెవాల్డ్ బ్రెవిస్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఏకంగా బేబీ ఏబీ, ఏబీ డివిలియర్స్ 2.ఓ అనే బిరుదులను సంపాదించాడు. ఈ పేర్లు రావడానికి అతను ఆడిన అద్భుత ఇన్నింగ్సులు ఒక కారణమైతే.. మరొకటి అతని బ్యాటింగ్ శైలి. అచ్చం ఏబీడీ లానే బ్యాటింగ్ చేస్తూ.. ఆ దిగ్గజ క్రికెటర్‌ను గ్రౌండ్‌లో చూస్తున్నట్లు ఆడాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లలో ఏకంగా రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
అండర్ 19 వరల్డ్ కప్‌లో తన మొదటి మ్యాచ్‌ను ఇండియాతోనే ఆడిన బ్రెవిస్.. ఆ మ్యాచ్‌లో 65 పరుగులు చేసి బౌలింగ్‌లో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. అలాగే వరుసగా.. ఉగాండాపై 104 పరుగులు, 2 వికెట్లు, ఐర్లాండ్‌పై 96 పరుగులు, ఇంగ్లండ్‌పై 97 పరుగులు, 2 వికెట్లు, శ్రీలంకపై 6 పరుగులు, ఒక వికెట్.. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 138 పరుగుల చేసి సంచలనం సృష్టించాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టి.. ఏబీడీ 2.ఓ అనే బిరుదు సొంతం చేసుకున్నాడు. మరి ఈ నయా సంచలనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The similarities with AB de Villiers were obvious, but Dewald Brevis looks to be on the way to make a name of his own in the international game.
A look at the phenom’s incredible #U19CWC campaign 👇https://t.co/NhqxDx0T2L
— ICC (@ICC) February 4, 2022