వికెట్ కీపర్ అనగానే మనకు మహేంద్ర సింగ్ ధోనీనే గుర్తొస్తాడు. అంతగా మన మనసుల్లో ముద్రవేశాడు. వికెట్ల వెనక చురుగ్గా కదలడం, రెప్పపాటులో స్టంపౌట్స్ చేయడం, డీఆర్ఎస్ పక్కాగా అంచనా వేయడం లాంటి విషయాలు మహీకి తెలిసినంతంగా మరో కీపర్ కి తెలియవు. ఇప్పుడు అలాంటి ధోనీ మరిపించేలా న్యూజిలాండ్ ఆటగాడు వికెట్ కీపింగ్ చేశాడు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రై సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం టీ20 మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచులో పాక్ జట్టు 6 వికెట్ల తేడాతో కివీస్ జట్టుపై విజయం కూడా సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. అనంతరం 18.2 ఓవర్లలోనే పాక్ టార్గెట్ పూర్తి చేసింది. ఈ మ్యాచ్ గెలవడంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, తన బ్యాటింగ్ తో కీలకపాత్ర పోషించాడు. అసలు విషయానికొస్తే… పాక్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో 12వ ఓవర్ ని టిమ్ సౌథీ వేశాడు. పాక్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ స్కూప్ షాట్ ఆడాడు. బంతి కనెక్ట్ అవడంతో బౌండరీవైపు దూసుకెళ్లింది. నార్మల్ గా అయితే అక్కడ ఫీల్డర్ ఉంటే ఓకే గానీ లేదంటే కచ్చితంగా ఫోరో సిక్సో వెళ్తుంది.
ఈ మ్యాచ్ లో మాత్రం డేవాన్ కాన్వే అది జరగనివ్వలేదు. మెరుపు వేగంతో ఏకంగా 50 మీటర్లు పరుగెత్తి మరీ బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపేశాడు. దీంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలోనే నెటిజన్స్ ధోనీని గుర్తుచేసుకుంటున్నారు. మహీ కూడా ఇలా ఎప్పుడూ బంతిని ఆపలేదని కామెంట్స్ పెడుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ధోనీతో కలిసి కాన్వే ఆడాడు. బహుశా ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ధోనీ దగ్గరే నేర్చుకున్నాడేమో అనిపిస్తోంది. మరి కాన్వే స్టన్నింగ్ ఫీల్డింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Better than Dhoni ever was
— иєѕн𓆏 (@mid_619) October 8, 2022
Conway>>>> Dhoni
— Danish ❤️🇮🇳 (@Sillent_01) October 8, 2022