ఐపీఎల్ 2021 రెండో దశ పోటీల్లో భాగంగా ఆదివారం ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 58 బంతుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 9 ఫోర్లు, 4 సిక్స్‌ర్లు ఉన్నాయి. ఆ నాలుగు భారీ సిక్సులలో ఇన్నింగ్స్ చివరి బంతికి కొట్టిన సిక్స్ మాత్రం రుతురాజ్‌ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. అదేంటంటే.. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహార్ బౌలింగ్‌లో రుతురాజ్ స్వీప్ షాట్‌తో సిక్స్‌ర్ కొట్టాడు. ఈ షాట్‌ను ముంబైతో మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలింగ్‌లో కొట్టకుంటే నేను నిన్ను చితక్కొడతా అని రుతురాజ్‌కు చాహార్ వార్నింగ్ ఇచ్చాడు. అదృష్టవశాత్తు ఇన్నింగ్స్ చివరి బంతిని చాహార్ చెప్పిన విధంగా సిక్స్ కొట్టి అతన్ని శాంతింపజేశాడు. ఈ విషయాన్ని ముంబైతో మ్యాచ్ ముగిసిన తర్వాత రుతురాజ్, చాహార్ మీడియాతో పంచుకున్నారు.
రుతురాజ్‌కు చాహార్ సీరియస్ వార్నింగ్