క్రికెట్‌లో ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం జరుగుతూనే ఉంటుంది.. ఆ టైమ్‌లో బౌలర్లు ఫీల్డర్లపై కోపం ప్రదర్శించడం, అసహనానికి గురికావడం కూడా సహజం. కానీ.. మొహమ్మద్ సిరాజ్ మాత్రం క్యాచ్ పట్టి కూడా బౌలర్ దీపక్ చాహర్ కోపానికి గురయ్యాడు. క్యాచ్ అయితే తీసుకున్నాడు కానీ.. వెనుకే ఉన్న బౌండరీ లైన్‌ను కూడా తొక్కేశాడు. దీంతో వికెట్ రావాల్సిన బాల్ సిక్స్‌గా మారడంతో దీపక్ చాహర్ తట్టుకోలేకపోయాడు. కోపంలో సిరాజ్‌పై బూతులతో రెచ్చిపోయాడు. సిరాజ్‌పై దీపక్ చాహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన భారత్-సౌతాఫ్రికా మధ్య ఇండోర్ వేదికగా మంగళవారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో డేవిడ్ మిల్లర్ వరుసగా మూడు సిక్సులతో దుమ్మురేపాడు. ఐదో బంతికి స్వ్వైర్‌లెగ్ వైపు మిల్లర్ భారీ షాట్ ఆడాడు. సిక్స్ వెళ్తున్న ఆ బంతిని సిరాజ్ చేతుల్లో పడింది. బౌండరీ లైన్ వద్ద మంచి క్యాచ్ తీసుకున్న సిరాజ్.. తన వెనుకే ఒక్క అడుగు దూరంలో బౌండరీ లైన్ ఉన్న విషయాన్ని గమనించకా.. క్యాచ్ పట్టిన తర్వాత ఒక అడుగు వెనక్కు వేయడంతో అది కాస్తా బౌండరీ లైన్‌పై పడింది. దీంతో పట్టిన క్యాచ్ సిక్స్ పాలైంది. దీని కంటే ముందే రెండు బంతులకు రెండు సిక్సులు వెళ్లడం, వికెట్ రావాల్సిన బాల్‌పై సిక్స్ రావడంతో దీపక్ చాహర్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో క్యాచ్ పట్టి బౌండరీ లైన్ తొక్కిన సిరాజ్‌ను బూతులు తిట్టాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిలీ రోసోవ్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడు క్వింటన్ డికాక్ 68 పరుగులతో రాణించడంతో ప్రొటీస్ జట్టు భారీ టార్గెట్‌ను టీమిండియా ఎదుట ఉంచింది. భారీ లక్ష్యఛేదనలో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్‌లోనే డకౌట్ అవ్వగా.. పంత్(27), దినేష్ కార్తీక్(46), దీపక్ చాహర్(31) పరుగులు చేసి రాణించారు. మిగతా వాళ్లు విఫలం అవ్వడంతో.. 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయి 49 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కానీ.. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
Deepak chahar to Siraj : abe bho**di k chu*iya😂😂😂😂😂😂😂#INDvsSA #deepakchahar #siraj #RohitSharma #india #Indiancricketteam #bcci #cricket pic.twitter.com/jeo8PsrBtx
— visionary billionaire (@visionarybilli4) October 4, 2022