‘ఐపీఎల్ 2021’ సెకండాఫ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ కాస్త నెమ్మదించినట్లు కనిపించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చైన్నై ఓటమిపాలై టేబుల్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. మ్యాచ్ అనతరం జరిగిన ఆస్తికర ఘటన చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎంతగానో ఆనందింపజేసింది. మ్యాచ్ అయ్యాక.. సీఎస్‌కే ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ అందరూ లైవ్‌లో తన గార్ల్ ఫ్రెండ్‌కు రింగ్ ఆఫర్ చేస్తూ ప్రపోజ్ చేశాడు. వెంటనే ఆమె ఎస్ అనడంతో ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. దీపక్ చాహర్ తన ప్రేయసిని కౌగించుకోగానే.. మొత్తం స్టేడియం అంతా హోరెత్తింది.
ఇరువురి సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ని యావత్ క్రీడాలోకం చూసి మురిసిపోయింది. వారిరువురు ఉంగరాలు మార్చుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఆటగాళ్లు సహా మొత్తం క్రికెట్ ప్రపంచం ఈ ప్రేమజంటకు శుభాకాంక్షలు తెలిపింది. లైవ్‌లో చాహర్ చేసిన పనిని తప్పుబడుతున్న వారు లేకపోలేదు. మ్యాచ్‌పై ఏకాగ్రత లేకుండా తన ప్రపోజల్ గురించే ఆలోచిస్తూ ఉండుంటాడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీపక్ చాహర్ ప్రపోజ్ చేసిన ఆమె ఎవరో కాదు.. హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ జయ భరద్వాజ్. ఆ వైరల్ వీడియో మీరు కూడా చూసేయండి.