టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జింబాబ్వే బ్యాటర్ ఇన్నోసెంట్ కియాకు భారీ ఝలక్ ఇచ్చాడు. సోమవారం జరిగిన చివరి వన్డేలో ఇన్నోసెంట్‌ను మన్కడింగ్ చేసి.. అప్పీల్ చేయకుండా వదిలేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఫస్ట్ ఓవర్‌ను దీపక్ చాహర్ వేయగా.. ఇన్నోసెంట్ కియా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. చాహర్ బాల్ రిలీజ్ చేయకముందే ఇన్నోసెంట్ కియా క్రీజు దాటుతుండడంతో చాహర్ బాల్‌ను రిలీజ్ చేయకుండా.. వికెట్లను కొట్టాడు.
కానీ రనౌట్ అప్పీల్ చేయకుండా ఇన్నోసెంట్ వైపు నవ్వుకుంటూ.. ‘ఈ సారికి వదిలేస్తున్న.. మళ్లీ క్రీజ్ దాటావో చూస్కో..’ అన్నట్లు మళ్లీ బౌలింగ్‌కు వెళ్లాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. దాంతో అంపైర్ డెడ్‌బాల్‌గా పరిగణించాడు. నిజానికి క్రికెట్ నిబంధనల ప్రకారం అది మన్కడింగ్ రనౌట్. 2019 ఐపీఎల్‌లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. అప్పట్లో ఇది పెద్ద దూమారమే రేపింది. అయితే కొందరు అశ్విన్‌ను సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు.
ఈ క్రమంలో ఈ నిబంధనపైన పునరాలోచన చేసిన మెర్లీబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఇకపై మన్కడింగ్‌ను లా-41 అనైతికం నుంచి లా-38 ప్రకారం రనౌట్‌గా మార్చిన విషయం తెలిసిందే. కానీ.. ఇలాంటి రనౌట్‌ను ఆటగాళ్లు పెద్దగా చేయరు. అందుకే చాహర్ కూడా ఇన్నోసెంట్‌ను అవుట్ చేసి అప్పీల్ చేయకుండా వదిలేశాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్ అతి కష్టంమీద గెలిచి ఊపిరి పీల్చుకుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక రేంజ్‌లో రచ్చ చేసిన టీమిండియా ఆటగాళ్లు!
Deepak Chahar didn’t Appeal on Mankad 😂 pic.twitter.com/4ihfnljbMl
— Keshav Bhardwaj 👀 (@keshxv1999) August 22, 2022