అదృష్టం బాగాలేకుంటే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెతా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో పాపం అతను అవుట్ అయిన విధానం అలా ఉంది మరి. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటీస్ బౌలర్లు 165 పరుగులకే కుప్పకూల్చారు. కగిసో రబడా 5 వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించాడు. బౌలర్లు అందించిన ఈ అద్భుతమైన ఆరంభాన్ని సౌతాఫ్రికా బ్యాటింగ్‌లోనూ కొనసాగించాలని భావించింది.
అందుకు తగ్గట్లే ఓపెనర్లు కెప్టెన్ డీన్ ఎల్గర్, సరేల్ ఎర్వీ సౌతాఫ్రికాకు మంచి ఆరంభం అందిస్తారు. దీంతో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో సౌతాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. 81 బంతుల్లో 8 ఫోర్లతో 47 పరుగులు చేసిన ఎల్గర్ జెమ్స్ అండర్సన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అది థైప్యాడ్‌కు తగిలి వెనుక నుంచి వెళ్లిగా వికెట్ల వైపు వెళ్తుంది. దాన్ని బ్యాట్‌తో ఆపేందుకు ప్రయత్నించినా.. అప్పటికే బంతి వికెట్లను తాకుతుంది. దీంతో ఎల్గర్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు.
అనుకోకుండా గిఫ్ట్‌లా ఎల్గర్ వికెట్ లభించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబురాలు చేసుకుంటారు. అంత సేపు అద్భుతంగా ఆడుతున్న ఎల్గర్ దురదృష్టవశాత్తు అవుట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసి.. 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మరి ఈ మ్యాచ్‌లో ఎల్గర్ అవుటైన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఒకే గ్రౌండ్‌లో 100 వికెట్లు తీసిన బ్రాడ్! గతంలో ఎంతమందికి ఈ రికార్డు ఉందంటే..