దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులో సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో గెలిచిన భారత్, రెండో టెస్టులో ఓడింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ నెల 11 నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ విజేతను డిక్లేర్ చేయనుంది. మూడో మ్యాచ్‌లో గెలిచి సౌత్ ఆఫ్రికాలో తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. కానీ రెండో టెస్టులో ఓటమితో కాస్త డీలా పడ్డా.. మూడో టెస్టులో శక్తి మేరా రాణించేందుకు వ్యూహాలు రచిస్తుంది.
ఇక రెండో టెస్టులో టీమిండియాను దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా దారుణంగా దెబ్బకొట్టాడు. ముఖ్యంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో అతనలా చెలరేగడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎల్గర్ రబడాను కావాలనే మాటలతో రెచ్చగొట్టినట్లు ఎల్డర్ స్వయంగా ప్రకటించాడు. మ్యాచ్‌లో రబడా కాస్త డల్‌గా కనిపించనప్పుడు, టీమిండియా పటిష్టంగా అవుతున్నప్పుడు, రహానే, పుజారా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో ఎల్గర్.. రబడాను మాటలతో రెచ్చగొట్టాడు. ‘నీకు నీవు తోపు అనుకుంటే సరిపోదు.. ఆటతో చూపెట్టాలని రబడా’ను రెచ్చగొట్టానని ఎల్గర్ తెలిపాడు. ఇలా ఎల్గర్ సూటి పోటీ మాటలు రబడాపై ప్రభావం చూపాయి. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రహానే, పుజారా జోడిని విడగొట్టాడు. అక్కడి నుంచి టీమిండియా వికెట్లు టపటపా పడ్డాయి.
Form is temporary but Class is permanent – Kagiso Rabada is top class 🇿🇦 🔥🔥 #SAvsIND pic.twitter.com/BCra5RMleh
— TK_Nala (@NalaThokozane) January 5, 2022
ఒక్కోసారి రబడా రిలాక్స్ అవుతాడని, అలాంటి సమయంలో అతన్ని మోటివేట్ చేయాల్సి ఉంటుందని ఎల్గర్ సరాదాగా చెప్పుకొచ్చాడు. అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత రబడా తన దగ్గరకు వచ్చి తాను అన్న వ్యాఖ్యలను గుర్తు చేశాడని తెలిపాడు. మరి ఎల్గర్ తన మాటలతో రబడాను రెచ్చగొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన పంత్! కారణం తెలిస్తే షాక్..