టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన సొంతూరు రూర్కీకి వెళ్తుండగా.. ప్రమాదానికి గురైన తర్వాత డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా మెరుగైన వైద్యం కోసం పంత్‌ను ముంబైకి తరలించారు. అయితే.. పంత్ ప్రస్తుత పరిస్థతి దృష్ట్యా.. అతను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా దూరం అవ్వనున్నట్లు సమాచారం. అయితే.. ఐపీఎల్‌లో రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక పంత్ ఐపీఎల్ 2023కు పంత్ దూరమైతే.. అది కచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద దెబ్బే. ఒక ఆటగాడితో పాటు.. కెప్టెన్‌ను సైతం ఢిల్లీ మిస్ అవుతుంది.
దీంతో పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే.. పంత్ అందుబాటులో లేకుంటే.. ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ నడిపించేందుకు ఒక మంచి కెప్టెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే.. ఢిల్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ అయితే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తన ఐపీఎల్ అరంగేట్రంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కే ఆడిన వార్నర్ ఆ తర్వాత.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారాడు. ఆ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్.. ఎస్‌ఆర్‌హెచ్‌ను 2016లో ఛాంపియన్‌గా నిలిపాడు. కొన్నేళ్ల పాటు సన్‌రైజర్స్‌ను విజయవంతంగా నడిపిన వార్నర్.. ఐపీఎల్ 2021 తర్వాత సన్‌రైజర్స్‌కు గుడ్‌బై చెప్పాడు. 2022 మెగా వేలంలో వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్ 2023కు పంత్ కచ్చితంగా అందుబాటులో లేకుంటే.. డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా చాలా సీనియర్ ప్లేయర్ అయిన వార్నర్‌కు ఎప్పుడో ఆస్ట్రేలియా కెప్టెన్సీ రావాల్సింది. కానీ.. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో అతనిపై జీవితకాలపు కెప్టెన్సీ బ్యాన్ ఉన్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే వార్నర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్సీ దక్కలేదు. కానీ.. ఐపీఎల్‌లో తన కెప్టెన్సీ సత్తా ఏంటో చాటిచెప్పాడు. తాజాగా సౌతాఫ్రికాపై రెండో టెస్టులో డబుల్ సెంచరీ సైతం సాధించిన వార్నర్ మంచి ఊపుమీదున్నాడు. దీంతో కెప్టెన్‌గా వార్నర్ సరైన వ్యక్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
David Warner could be the captain for Delhi Capitals in the absence of Rishabh Pant. pic.twitter.com/A9B2oPcAEp
— FAIZ FAZEL (@theFaizFazel) January 5, 2023