ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవిత శోభ సంతరించుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ విగ్రహాలను ఏర్పాట చేసుకుని.. పూజాపురస్కారాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న హిందువులు కూడా తమ ఇష్టదైవం గణపతిని భక్తితో ప్రార్థిస్తున్నారు. కొంత మంది తాము కొలుస్తున్న గణేష్ ప్రతిమలను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. పండుగ వాతావరణాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహం ముందు దండం పెడుతున్న ఒక ఫొటోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్టు చేశాడు. క్షణాల్లో ఆ ఫొటో వైరల్ గా మారింది. జై బోలో గణేష్ మహరాజ్‌కి అంటూ నెటిజన్లు వార్నర్ పోస్టుకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా.. ఐపీఎల్‌తో ఇండియాలో అభిమానులను సంపాదించుకున్న వార్నర్… మన దేశం పట్ల తన విధేయతను, ప్రేమను సమయం వచ్చినప్పుడల్లా చాటుకుంటూ ఉంటాడు. తాజాగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి ఫొటోను షేర్ చేసి భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో తొలుత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన వార్నర్.. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడి, కెప్టెన్ కూడా అయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌కు ముఖచిత్రంగా మారిపోయాడు. సన్‌రైజర్స్‌కు తన కెప్టెన్సీలో ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. దీంతో అభిమానులు కూడా వార్నర్‌ను డేవిడ్ భాయ్ అంటూ మనలో ఒకడిగా ఆదరించారు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అభిమానానికి ఫిదా అయిపోయిన వార్నర్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెలుగు సినిమా డైలాగ్స్, డాన్స్ చేస్తూ.. తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు.
కానీ.. ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించి ఘోరంగా అవమానించింది. దీంతో అతనిపై ఇండియన్ క్రికెట్ అభిమానులు మరింత సానుభూతి చూపించి.. అక్కున చేర్చుకున్నారు. అతనిపై అభిమానంతో సన్‌రైజర్స్ టీమ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇక ఐపీఎల్ 2022 మెగా వేలంలో వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కోనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరి వార్నర్ గణపతి ఫొటోను షేర్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: సురేష్ రైనా వారసుడు వచ్చేస్తున్నాడు..!