క్రికెట్ ప్రపంచంలో ప్రతీ క్రీడాకారుడి ఆశ.. తన దేశానికి వరల్డ్ కప్ అందించడం. దానికోసం ఎంతో పోరాడాల్సి వస్తుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో.. దేశానికి వరల్డ్ కప్ అందించాలన్న కల కలగానే మిగిలిపోతుంది. ఇలా కలకల్లలు అయినప్పుడే ఆటగాళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్2022లో విఫలం అయిన ఆటగాళ్లు తమ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్గానిస్తాన్ ఆటగాడు, విండీస్ కోచ్ తమ తమ వీడ్కోలును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఓ షోలో చెప్పాడు. దాంతో ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇప్పుడీ వార్త హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
డేవిడ్ వార్నర్.. తన ఆటతో పాటుగా సోషల్ మీడియాలో డ్యాన్స్, యాక్టింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు తెలుగు సినిమా పాటకు, డైలాగ్ లకు డబ్ ష్మాష్ లు చేస్తూ.. భారతీయుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఫామ్ లో లేక తెగ ఇబ్బంది పడుతూ.. జట్టుకు భారంగా మారాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022లో పరుగులు చేయడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. 4 ఇన్నింగ్స్ ల్లో వార్నర్ చేసిన పరుగులు 44 మాత్రమే. ఇందులో ఆఫ్గానిస్తాన్ పై చేసిన 25 రన్స్ బెస్ట్ స్కోర్. టీ20 వరల్డ్ కప్ లో విఫలం కావడంతో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్నర్ ఓ షోలో ప్రకటించాడు. ట్రిపుల్ M డెడ్ సెట్ లెజెండ్స్ షోలో వార్నర్ మాట్లాడుతూ..”టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు ఆందోళనలో పడింది. అందుకే నేను ఆ ఫార్మాట్ నుంచి వెదొలగాలని అనుకుంటున్నాను. త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్ తర్వాత.. టెస్టు క్రికెట్ నుంచి నేను బహుశా వైదొలగొచ్చు. కానీ వన్డేల్లో, టీ20 ల్లో కొనసాగుతాను. 2024లో జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో నేను కొనసాగుతాను” అంటూ వార్నర్ పేర్కొన్నాడు.
David Warner hinted he will retire from Tests after Ashes and try to play in the 2024 T20 World Cup.
— Johns. (@CricCrazyJohns) November 14, 2022
ఇక వైట్ బాల్ క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని.. ఇది ఒక అద్బతమైన ఆట అని వార్నర్ చెప్పుకొచ్చాడు. అదీకాక చాలా మంది నాకు వయసై పోయిందనుకుంటున్నారు, మీరు ఏమి కోరుకుంటున్నారో జాగ్రత్తగా చూడండి అంటూ వార్నర్ అన్నాడు. ఈ సంవత్సరమే నా టెస్ట్ క్రికెట్ కు బహుశా ఆఖరి ఏడాది కావొచ్చు అని వెల్లడించాడు. కాగా వచ్చే ఏడాది జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ తో ప్రారంభం కానుంది. అయితే డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా పగ్గాలు చేపట్టాలని చూస్తున్న క్రమంలో.. యాజమాన్యం నుంచి సరైన ప్రకటన రాకపోవడంతోనే వార్నర్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు అక్కడి వర్గాల్లో చర్చ జరుగుతోంది.