టీ20 వరల్డ్ కప్ 2021లో గురువారం జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా అద్భుతమైన విజయం సాధించింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన పాక్ కీలకమైన నాకౌట్ సెమీస్‌లో చేతులెత్తేసింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కొంచెం తడబడతూ కనిపించింది.. ఈ దశలో 8వ ఓవర్ వేసేందుకు వచ్చిన పాక్ సీనియర్ ప్లేయర్ హఫీజ్ వేసిన మొదటి బంతి స్టేడియంలో ప్రేక్షకులను నవ్వుల్లో మొంచెత్తింది.
సాధారణంగా గల్లీ క్రికెట్ ఆటగాళ్లు వేసినట్లు బంతి విసిరాడు. ఆ బంతి రెండు స్టెపులు పడి వెళ్లింది. ఇక బ్యాటింగ్ చేస్తున్న విధ్వసానికి ప్రతిరూపంలో డేవిడ్ వార్నర్ దాన్ని వదులుతాడా?.. కసితో కొడితే వెళ్లి స్టాండ్స్‌లో పడింది. చాలా నెమ్మదిగా వచ్చిన బంతిని ముందుకు వచ్చి మరీ చావబాదాడు. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ఏం జరుగుతుందో అర్థం కాక బిత్తరపోయాడు. అసలు ఆ బౌలింగ్ ఏంటి? ఆ షాట్ ఏంటి అన్నట్లు ఫేస్ పెట్టాడు. ఆపై ఆ బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. హఫీజ్ వేసిన బంతిని వార్నర్ సిక్స్ కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి హఫీజ్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
One of the funny moments from the T20 World Cup 2021 – the awareness of Warner was brilliant. pic.twitter.com/jli3ziYv3C
— Johns. (@CricCrazyJohns) November 11, 2021
This was ridiculous. The ball bounced twice and David Warner hit for a six and umpire gave it a no ball. Hafeez 🤦♂️🤦#PAKvAUS @davidwarner31#hassanAli #PAKvAUS #AUSvsPAK pic.twitter.com/UZkADENkBv
— Syed Yasir (@imSyed_Yasir) November 11, 2021